చాలామంది తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతోనో లేదా బద్ధకం అలవాటవుతుందనో పిల్లలను ఎక్కువ సేపు నిద్రపోనివ్వరు. వాళ్లు కంటి నిండా నిద్రపోకముందే నిద్రలేపేస్తుంటారు. కారణం... వాళ్లు అలా నిద్రపోతూ ఉండటం, చురుగ్గా లేకపోవడంతో వాళ్లకేమైందో అన్న ఆందోళన వాళ్లను అలా నిద్రలేపేలా చేస్తుంది.పిల్లలు కంటినిండా నిద్రపోకపోవడం వల్ల వాళ్లు చికాకుగా, చిరాగ్గా ఉంటారని తెలుసుకోవాలి. రానున్నది చలికాలం. ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా సేపు నిద్రపోవడం చాలా సాధారణం.
చలికాలంలో ఎక్కువ సేపు నిద్ర ఎందుకు?
పిల్లలు చలికాలంలో కొద్దిగా ఎక్కువగా నిద్రపోవడం చాలా సాధారణం. దీనికి మొదటి కారణం చలికాలంలో పగటి సమయం తక్కువ, రాత్రి నిడివి ఎక్కువ; రెండోకారణం వెలుగు తగ్గిపోయి చీకటి పడగానే నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ స్రావాలు పెరగడం, నిద్ర మేల్కోడానికి ఉపయోగపడే సెరటోనిన్ స్రావాలు తగ్గడం... వంటి మార్పుల వల్ల చలికాలంలో నిద్ర పెరుగుతుంది.
పిల్లలు ఎక్కువసేపు పడుకోవడానికి కొన్ని కారణాలు...
⇒ బరువు ఎక్కువగా ఉన్న చిన్నారులు
⇒ శ్వాస తీసుకోవడంలో సమస్యలున్నప్పుడు
⇒ సర్కాడియన్ రిథమ్‌లో మార్పులు (మనుషుల్లో నిద్రపోవడం, నిద్రలేవడంలోని క్రమబద్ధతను నిర్వహించే రిథమ్‌ను సర్కాడియన్ రిథమ్ అంటారు)
⇒మెదడు పనితీరులో కొన్ని లోపాలు ∙దగ్గు, జలుబు, అలర్జీలకు వాడే కొన్ని మందులు ∙ఆహార పదార్థాలు, హర్మోన్లలో మార్పుల వల్ల నిద్ర వ్యవధిలో మార్పులు రావడం వంటి అంశాలు నిద్ర పెరగడానికి
కారణమవుతాయి.
మరి... ఎన్ని గంటల నిద్ర నార్మల్...? పిల్లల్లోగాని, పెద్దల్లోగాని ఖచ్చితంగా నిద్రపోవాల్సిన వ్యవధి ఇదీ అంటూ ఎవరూ నిర్దిష్టంగా, నిర్ధారణగా చెప్పలేరు. మనుషులకు ఎన్ని గంటల నిద్ర సరిపోతుందన్న అంశం ఎప్పుడూ చర్చనీయాంశమైన విషయమే. అయితే సాధారణంగా పిల్లలు 8–9 గంటల పాటు నిద్రపోవడాన్ని నార్మల్‌గా పరిగణించవచ్చు. రోజూ పది గంటలకు మించి నిద్రపోవడాన్ని మాత్రమే కొన్ని రుగ్మతలకు సూచికగా చెప్పవచ్చు. ఒక ఉజ్జాయింపుగా చె΄్పాలంటే రోజుకు పదిగంటల కంటే ఎక్కువ, నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చిన్నారులు ఈ వ్యవధి కంటే తక్కువగా నిద్రపోతుంటే ఒకసారి థైరాయిడ్ హార్మోన్ పరీక్షలు చేయించి, పిల్లల డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment