సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయంతో ప్రపంచమంతా గుండెలరచేతిలో పట్టుకుని బతుకు జీవుడా అని కాలం గడుపుతోంటే.. ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలను వెల్లడించారు. మానవుడి జీవిత కాలాన్ని 120 సంవత్సరాల వరకూ పెంచే మార్గం సుగమం కానుందని, ఈ మేరకు తమ పరశోధనలు కొత్త ఊపిరిలూదుతున్నాయని చెబుతున్నారు. వృద్ధాప్య ప్రక్రియలో సాధారణంగా క్షీణించే ఎస్‌ఐఆర్‌టీ-6 అనే ప్రోటీన్ సరఫరాను పెంచడం ద్వారా మనిషి దీర్ఘం కాలం మనిషి దీర్ఘకాలం జీవించే మార్గాన్ని గుర్తించామని బార్-ఇలాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు.
పరిశోధకులు 250 ఎలుకలపై పరిశోధన గావించి వాటి ఆయుర్దాయం పెంచారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించబడిన పీర్-రివ్యూ పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించింది. ఆయుర్దాయంపై పురోగతి ప్రయోగశాల పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న హైమ్ కోహెన్ మాట్లాడుతూ, ఎలుకల ఆయుర్దాయం 23 శాతం పెంచడానికి ఒక మార్గాన్ని కనుగొన్నామన్నారు. ఎలుకలలో తామె చూసిన మార్పులు మానవులకు అనువదించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రయోగం ఆడ, మగ ఎలుకలపై నిర్వహించగా ఆడ ఎలుకలపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. మగ ఎలుకల వయస్సు ఎక్కువ పెరిగిందని వివరించారు. మగ ఎలుకల జీవితకాలం 30 శాతం, ఆడవారి జీవితకాలం కేవలం 15 శాతం పెరిగిందని చెప్పారు. అలాగే ఈ ప్రోటీన్ తక్కువ కొలెస్ట్రాల్‌ను కలిగి ఉంటుందని, క్యాన్సర్ నుండి రక్షించడానికి కూడా పనిచేస్తుందని తెలిపారు. కోహెన్ ప్రకారం, వృద్ధాప్య ఎలుకలలో వయస్సుతో శక్తి సాధారణంగా తగ్గుతుంది. కాని వాటి శరీరంలో ఈ ప్రోటీన్ పెరగడం వల్ల శక్తి పెరిగింది.
అయితే జన్యుపరంగా మార్పు చేయడం ద్వారా ఎలుకలలో ఎస్‌ఐఆర్‌టీ-6 అనే స్థాయిలను అతను సులభంగా పెంచగలిగినప్పటికీ, మానవులలో ప్రోటీన్‌ను పెంచడానికి మందులు అవసరం. రెండు మూడు సంవత్సరాలలో మానవులలో ఫలితాలను ప్రతిబింబించగలదని కోహెన్ చెప్పారు. దీని స్థాయిలను పెంచే చిన్న అణువులను అభివృద్ధి చేస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే ఉన్న ప్రోటీన్లను మరింత చురుకుగా చేయనున్నారు. వృద్ధాప్యాన్ని పరిష్కరించడానికి భవిష్యత్తులో వీటిని ఉపయోగించవవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
చదవండి : కరోనా: రిలయన్స్ మరో సంచలన నిర్ణయం
బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ డైరెక్టరుగా ఆర్థికవేత్త కల్పన కొచర్
Comments
Please login to add a commentAdd a comment