ఓ చిట్టెలుక.. ఓ రోజు ఉదయాన్నే ఆకలి వేయడంతో వేటకు బయలుదేరింది.. బ్లాక్‌బెర్రీ పళ్లు దాని కళ్లలో పడ్డాయి.. కానీ కొంచెం ఎత్తులో ఉన్నాయి.. అయినా వెనకడుగు వేయలేదు.. అందని బ్లాక్‌బెర్రీ పుల్లన అని అనుకోలేదు.. దాని చిట్టి మెదడుతో గట్టి ఐడియానే వేసింది.. వెనక కాళ్లపై నిటారుగా నుంచొని కొంచెం పైకి ఎగిరి ఆ కొమ్మను అందుకుంది.. అంతే అలా గాలిలో వేలాడుతూనే బెర్రీలను సుష్టుగా లాగించేసింది.. తర్వాత ఎంచక్కా కిందకు దిగి వెళ్లిపోయింది! వియన్నాలోని ఓ శ్మశానంలో కనిపించిన ఈ దృశ్యాలను జులియన్ గెహర్మన్ రాడ్ అనే విద్యార్థి కెమెరాలో బంధించాడు.
చిట్టెలుక.. గట్టి ఐడియా!
Published Mon, Aug 24 2015 10:38 AM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM
Advertisement