అన్నానగర్(చెన్నై): గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ.. ఓ డ్రైవర్ శుక్రవారం కడలూరు బస్టాండ్‌లోకి లారీని తీసుకెళ్లడం కలకలం రేపింది. వివరాలు.. మార్గం తెలియని పట్టణాల్లో వెళ్తున్నప్పుడు ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్‌ను అనుసరించి డ్రైవర్లు ప్రయాణిస్తుంటారు. అయితే గూగుల్ మ్యాప్ తప్పు చూపిచడంతో ఒక్కోసారి ప్రమాదలకు సైతం గురవుతుంటారు. వివరాలు.. శుక్రవారం కడలూరులోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి తిరుకోవిలూరు మీదుగా బెంగళూరుకు ట్రక్కులో రసాయనాలకు సంబంధించిన ముడిసరుకును ఓ డ్రైవర్ లారీలో లోడ్ చేస్తున్నాడు. షార్ట్ కట్ కోసం వెతుకుతున్న అతను గూగుల్ మ్యాప్స్ సహాయం కోరాడు.
దాని ప్రకారం గూగుల్ మ్యాప్ ద్వారా కడలూరు ముత్తునగర్, ఇంపీరియల్ రోడ్డుకు వచ్చి లారె¯న్స్ రోడ్డు, వన్‌వే రోడ్డుకు వచ్చాడు. కానీ అక్కడ రైల్వే సొరంగం ఉండడంతో అది దాటి వెళ్లలేక వాహనాన్ని అక్కడే నిలిపాడు. ట్రాఫిక్ సమస్య ఏర్పడి ఆటో డ్రైవర్లు గొడవ పడడంతో గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి వస్తూ.. ఇక్కడ ఇరుక్కుపోయానని చెప్పాడు. తర్వాత ముందుకు పోనిచ్చే క్రమంలో లారీని బస్ స్టేషన్‌లోకి తీసుకెళ్లాడు. లారీ ఒక్కసారిగా బస్ స్టేషన్‌లోకి రావడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. తర్వాత స్థానికుల సహాయంతో డ్రైవర్ ఎలాగో అలా.. లారీని మెయిన్ రోడ్డులోకి తీసుకొచ్చాడు. ఈక్రమంలో ట్రాఫిక్‌కు భారీగా అంతరాయం ఏర్పడడంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
చదవండి: ఆలయాల్లోకి సెల్‌ఫోన్లు నిషేధం.. వస్త్రధారణ సరిగా ఉండాలన్న మద్రాస్ హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment