
బ్రిడ్జిపై నుంచి పడిన ఆయిల్ ట్యాంకర్: డ్రైవర్ మృతి
వరంగల్ : నగరంలోని హెచ్‌ఎన్‌కె హంటర్ రోడ్ బ్రిడ్జిపై నుంచి ఆయిల్ ట్యాంకర్ పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న డీజిల్ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందికి పడిపోయింది. ఈ సంఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ట్యాంకర్‌లోంచి డీజిల్ లీక్ అవుతోంది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లీక్ అవుతున్న ట్యాంకర్ వద్ద ప్రమాదం జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. డ్రైవర్ మృతి చెందడంతో వివరాలు తెలియడం లేదు.