
సాక్షి, వరంగల్ : వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం తెలంగాణ పోలీసు అధికారి ప్రాణాలను బలి తీసుకుంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఎస్‌ఐ సోమకుమారస్వామి(56) మృతిచెందారు. దీంతో, ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల ప్రకారం.. గీసుగొండ మండలం హట్యాతండా దగ్గర ఎస్‌ఐ కుమారస్వామి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమారస్వామి తీవ్రంగా గాయపడటంతో ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందతూ మృతిచెందారు. అయితే, ఎస్‌ఐ సోమకుమార్ ఆదివారం వరంగల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, గీసుకొండ మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన సోమకుమారస్వామి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతం
Comments
Please login to add a commentAdd a comment