Five Killed In Road Accident At Bapatla District, Details Inside - Sakshi
Sakshi News home page

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అద్దంకి ఎస్‌ఐ భార్య, కూతురు మృతి

Published Sun, Feb 19 2023 7:22 AM | Last Updated on Sun, Feb 19 2023 10:16 AM

Road Accident In Bapatla District - Sakshi

సాక్షి, బాపట్ల జిల్లా: మేదరమెట్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో అద్దంకి ఎస్సై సమంధర్ వలి  భార్య  కూతురు కూడా ఉన్నారు. చిన్నగంజాం లో తిరుణాలకు డ్యూటీకి వెళ్లిన ఎస్సై సమందర్ వలి, తన భార్య కూతురుతో పాటు, పక్కింటి మరో ఇద్దరిని కూడా తీసుకెళ్లారు. శివాలయంలో దర్శనం ముగించుకున్న తర్వాత డ్రైవర్‌ని ఇచ్చి  కుటుంబ సభ్యులను అద్దంకి ఇంటికి పంపించారు.

అయితే తిరుగు ప్రయాణంలో మేదరమెట్ల జాతీయ రహదారిపై రాగానే డ్రైవర్ కునుకు తీయడంతో ఒకసారిగా కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు పల్టీ కొట్టి అవతలి రోడ్డుపై పడిపోవడంతో అటుగా వచ్చిన లారీ కారుని ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వహీదా(39) ఆయేషా(9) గుర్రాల జయశ్రీ (50) గుర్రాల దివ్య తేజ(27), డ్రైవర్ బ్రహ్మచారిగా గుర్తించారు.

డ్రైవర్ చేసిన తప్పిదం వల్ల ఐదుగురు నిండు ప్రాణాలు బలయ్యాయి.. తన భార్యతో పాటు తన 9 ఏళ్ల కూతురు ప్రమాదంలో చనిపోవడంతో అద్దంకి ఎస్ఐ సమందర్ వలి బోరున వినిపిస్తున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. మృతదేహాలను అద్దంకి మార్చురీకి తరలించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement