డ్రైవర్ పంట పండింది..! | lorry driver won million pound lottory | Sakshi
Sakshi News home page

డ్రైవర్ పంట పండింది..!

Published Thu, Apr 2 2015 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

డ్రైవర్ పంట పండింది..!

డ్రైవర్ పంట పండింది..!

లండన్: అదృష్టమంటే వీరిదే.  ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ లాంగ్, క్యాథలీన్ జంటను యూరో లాటరీలో రూ. కోట్లు వరించాయి. అదీ ఒకసారి కాదు రెండుసార్లు! తొలుత 2013లో వీరికి మిలియన్ పౌండ్ల(రూ. 10 కోట్లు) యూరో లాటరీ తగిలింది.

 

అప్పట్లో కోట్లు గెలిచిన ఆ టికెట్‌ను వారు అదివరకే చెత్తకుండీలో పడేశారు. తర్వాత ఓసారి చెక్‌చేస్తే పోలే.. అని తిరిగి కుండీలోని టికె ట్‌ను తీసి నంబర్ చెక్‌చేయడంతో లాటరీ దానికే వచ్చినట్లు తెలుసుకున్నారు. తనకు ఎప్పటికైనా లాటరీ తగులుతుందన్న నమ్మకముండేదని చెప్పే డేవిడ్ ఆ తర్వాత కూడా లాటరీ టికెట్లు కొనడం కొనసాగించాడు. దీంతో శుక్రవారం నాటి ‘యూరోమిలియన్స్ మెగాఫ్రైడే డ్రా’లో వీరిని మళ్లీ మిలియన్ పౌండ్లతో పాటు ఓ జాగ్వార్ కారూ వరించింది. ఏళ్లు లారీ డ్రైవర్‌గా పనిచేసి రిటైరైన డేవిడ్  విలాసవంతమైన బంగ్లా కొనుగోలు చేసి శేష జీవితాన్ని దర్జాగా గడిపేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement