lottory
-
33 లక్షల లాటరీ టికెట్‌తో కొట్టుకొచ్చిన మృతదేహం
ఒట్టావా: సాధారణంగా లాటరీ గెలిస్తే ఎవరి సంతోషానికైనా హద్దులుండవు. కానీ, ఓ వ్యక్తి లాటరీ గెలిచినా ఆనందం పొందలేక పోయాడు. ఆనందం విషయం పక్కనపెడితే.. ఆయన సజీవంగా లేకపోవటం కలకలం సృష్టింస్తోంది. ఈ ఘటన కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 57 ఏళ్ల గ్రెగొరీ జార్విస్ అనే వ్యక్తి గత శుక్రవారం కెనడాలోని ఓ బీచ్‌లో విగతజీవిగా కనించాడు. స్థానికుల సమాచారంతో బీచ్‌లో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: US Govt Says : వడ్రంగి పిట్టలు ఇక కనుమరుగైనట్టేనా! అతని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు విలువైన లాటరీ లభ్యమైంది. సుమారు రూ.33 లక్షల లాటరీని అతను గెలుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సముద్రంలో బోట్ అదుపు తప్పటం వల్ల మృతి చెందాడని, తర్వాత అతని మృతదేహం బీచ్‌కు కొట్టుకొచ్చినట్లు తెలిపారు. ఇక అతని మృతదేహం వద్ద లభించిన లాటరీ టికెట్ సెప్టెంబర్ నెల ప్రారంభంలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. అతను అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
డ్రైవర్ పంట పండింది..!
లండన్: అదృష్టమంటే వీరిదే. ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ లాంగ్, క్యాథలీన్ జంటను యూరో లాటరీలో రూ. కోట్లు వరించాయి. అదీ ఒకసారి కాదు రెండుసార్లు! తొలుత 2013లో వీరికి మిలియన్ పౌండ్ల(రూ. 10 కోట్లు) యూరో లాటరీ తగిలింది. అప్పట్లో కోట్లు గెలిచిన ఆ టికెట్‌ను వారు అదివరకే చెత్తకుండీలో పడేశారు. తర్వాత ఓసారి చెక్చేస్తే పోలే.. అని తిరిగి కుండీలోని టికె ట్ను తీసి నంబర్ చెక్‌చేయడంతో లాటరీ దానికే వచ్చినట్లు తెలుసుకున్నారు. తనకు ఎప్పటికైనా లాటరీ తగులుతుందన్న నమ్మకముండేదని చెప్పే డేవిడ్ ఆ తర్వాత కూడా లాటరీ టికెట్లు కొనడం కొనసాగించాడు. దీంతో శుక్రవారం నాటి ‘యూరోమిలియన్స్ మెగాఫ్రైడే డ్రా’లో వీరిని మళ్లీ మిలియన్ పౌండ్లతో పాటు ఓ జాగ్వార్ కారూ వరించింది. ఏళ్లు లారీ డ్రైవర్‌గా పనిచేసి రిటైరైన డేవిడ్ విలాసవంతమైన బంగ్లా కొనుగోలు చేసి శేష జీవితాన్ని దర్జాగా గడిపేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. -
నైజీరియన్ల ఆటకట్టించిన సైబర్‌క్రైమ్ పోలీసులు
హైదరాబాద్‌సిటీ : లాటరీ పేరుతో ప్రజలకు శఠగోపం పెట్టేందుకు ఇద్దరు నైజీరియన్లు వేసిన స్కెచ్‌ను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు పసిగట్టి వారి గుట్టును రట్టు చేశారు. ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసి వారి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ ఏసీపీ జయరాం కథనం ప్రకారం... నైజీరియాకు చెందిన క్రిస్టోఫర్ (31), ఓజియోబీ అమీన్ విక్టర్ (34)లు అక్రమంగా మూడేళ్ల నుంచి నగరంలో ఉంటున్నారు. వీరిద్దరు లాటరీల పేరుతో ప్రజలకు కుచ్చుటోపి పెట్టేందుకు కుట్రలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే మణికొండ ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ను నెల రోజుల క్రితం అద్దెకు తీసుకుని రెండు ల్యాప్‌టాప్‌ల ద్వారా లక్ష ఈమెయిల్ ఐడీలను సంపాదించారు. వారందరికి మెక్రోసాఫ్ట్ ఔట్లూక్, కొకకోలా బీబీసీ, రెడ్బ్లూలో లాటరీ గెలిచారని ఈ మెయిల్స్ చేశారు. లాటరీ మొత్తం డబ్బులు కావాలంటే ట్యాక్స్, ఆర్బీఐ అనుమతి కింద కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, ఈ డబ్బులు తాము పేర్కొన్న అకౌంట్లో వేయాలని ఈ మెయిల్స్ పంపించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్, ఎస్ఐలు విజయవర్ధన్, మైపాల్‌రెడ్డిలు దర్యాప్తు చేపట్టారు. ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీయగా నైజీరియన్లు అద్దెకు ఉంటున్న ఫ్లాట్‌ను గుర్తించి దాడి చేశారు. వారి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు సెల్ఫోన్లు, పలు సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకుని వారిద్దరిని రిమాండ్‌కు తరలించారు.