
ఒట్టావా: సాధారణంగా లాటరీ గెలిస్తే ఎవరి సంతోషానికైనా హద్దులుండవు. కానీ, ఓ వ్యక్తి లాటరీ గెలిచినా ఆనందం పొందలేక పోయాడు. ఆనందం విషయం పక్కనపెడితే.. ఆయన సజీవంగా లేకపోవటం కలకలం సృష్టింస్తోంది. ఈ ఘటన కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 57 ఏళ్ల గ్రెగొరీ జార్విస్ అనే వ్యక్తి గత శుక్రవారం కెనడాలోని ఓ బీచ్‌లో విగతజీవిగా కనించాడు. స్థానికుల సమాచారంతో బీచ్‌లో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: US Govt Says : వడ్రంగి పిట్టలు ఇక కనుమరుగైనట్టేనా!
అతని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు విలువైన లాటరీ లభ్యమైంది. సుమారు రూ.33 లక్షల లాటరీని అతను గెలుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సముద్రంలో బోట్ అదుపు తప్పటం వల్ల మృతి చెందాడని, తర్వాత అతని మృతదేహం బీచ్‌కు కొట్టుకొచ్చినట్లు తెలిపారు. ఇక అతని మృతదేహం వద్ద లభించిన లాటరీ టికెట్ సెప్టెంబర్ నెల ప్రారంభంలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. అతను అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment