నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఓ లారీ డ్రైవర్ వడదెబ్బతో చనిపోయాడు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఓ లారీ డ్రైవర్ వడదెబ్బతో చనిపోయాడు. స్థానిక గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య(43) బుధవారం మధ్యాహ్నం లారీ డ్రైవర్ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు. అస్వస్థతగా ఉందని చెప్పటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం కుదుటపడటంతో సాయంత్రం ఇంటికి తీసుకువచ్చారు. అర్థరాత్రి సమయంలో తిరిగి అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.