ellaiah
-
ఫలక్‌నుమా బాంబు..ఎల్లయ్య మానసిక రోగి
హైదరాబాద్: ఫలక్‌నుమా ప్యాలెస్ లో బాంబు ఉందంటూ 108కి డయల్ చేసిన వ్యక్తి ఆచూకీని దక్షిణ మండలం పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి మానసిక రుగ్మతతో బాధ పడుతూ ఈ కాల్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారా యణ బుధవారం తన కార్యాల యంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. మంగళవారం జీఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి 8.45కు, అమెరికా అ«ధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ 8.54కు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రవేశించారు. సరిగ్గా రాత్రి 8.43కు ఓ గుర్తు తెలియని వ్యక్తి 108ృఈఎంఆర్ఐ అంబులెన్స్‌కు కాల్ చేసి ప్యాలెస్‌లో బాంబు పెట్టారంటూ భయపడుతూ... వణుకుతున్న స్వరంతో సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఈ వివరాలను 100 డయల్‌తో పాటు పోలీస్ సెక్యూరిటీ విభాగాలకు సమాచారం అందించారు. పోలీసులు ఎలాంటి ఆందోళనలు చెందకుండా ప్యాలెస్‌లో గట్టి బందోబస్తు కొనసాగిస్తూ కాల్ చేసిన వ్యక్తిపై ఆరా తీసేందుకు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో సదరు వ్యక్తి మల్కాజ్‌గిరికి చెందిన బొంత ఎల్లయ్య(60)గా గుర్తించారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న ఈయనను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించారు. కోర్టు ఆదేశానుసారం చికిత్స అనంతరం ఈ నెల 24న ఇంటికి తీసుకొచ్చారు. అతడు బయటికి వచ్చిన వెంటనే ఎక్కడ చూసినా జీఈ సదస్సు విషయమే మారుమోగుతుండటంతో బాంబు ఉందంటూ ఫోన్ చేసి బెదిరించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే 27న ఫోన్ కొనుగోలు చేశాడు. మంగళవారం రాత్రి 108కి ఫోన్ చేసి బాంబు అంటూ కాల్ చేశాడు. కాల్ డేటా ఆధారంగా పోలీసులు సమాచారం సేకరించారు. సైబరాబాద్ పరిధిలో తన కొడుకుతో ఆటోలో వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మానసిక స్థితి బాగోలేని ఎల్లయ్యను ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలిస్తామని డీసీపీ వెల్లడించారు. -
పవర్లూమ్ కార్మికుని ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన తొర్ర ఎల్లయ్య(55) అనే పవర్‌లూం కార్మికుడు అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. గతకొన్నేళ్లుగా ఎల్లయ్య మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లకు వివాహం చేయగా, ఒక కుమార్తెకు విడాకులై ఇంటివద్దే ఉంటోంది. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్య కుటుంబ అవసరాల కోసం రూ.5లక్షల దాకా అప్పు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని పోషించుకోలేక మనస్తాపం చెంది సోమవారం విషపదార్థం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
అప్పుల బాధతో నేతన్న ఆత్మహత్య
సిరిసిల్ల: అప్పుల బాధ తాళలేక ఓ నేతన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన తొర్ర ఎల్లయ్య(55) నేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
హత్నూర్ మండలం ముచ్చర్లలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. జనరేటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి మిద్దె ఎల్లయ్య(50) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గోడ కూలి కార్మికుడు దుర్మరణం
అత్తాపూర్‌లోని మారుతినగర్లో శుక్రవారం సాయంత్రం గాలి వానకు గోడ కూలిపోవడంతో కార్మికుడు మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా వీచిన గాలులకు నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలింది. శిధిలాలు కార్మికులపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎల్లయ్య అనే కార్మికుడు మృతి చెందగా మరొక కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కార్మికుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
కరీంనగర్ జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో వడదెబ్బ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. 43వ డివిజన్ పరిధిలోని అల్లూరు గ్రామానికి చెందిన బాదే చిన్న ఎల్లయ్య (60) పనుల కోసం ఆదివారం బయటకు వెళ్లాడు. ఎండ కారణంగా అస్వస్థత పాలయ్యాడు. అర్ధరాత్రి ఇంట్లో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
వడదెబ్బతో లారీ డ్రైవర్ మృతి
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఓ లారీ డ్రైవర్ వడదెబ్బతో చనిపోయాడు. స్థానిక గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య(43) బుధవారం మధ్యాహ్నం లారీ డ్రైవర్ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు. అస్వస్థతగా ఉందని చెప్పటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం కుదుటపడటంతో సాయంత్రం ఇంటికి తీసుకువచ్చారు. అర్థరాత్రి సమయంలో తిరిగి అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.