ఖమ్మం : ఖమ్మం జిల్లా వైరా దగ్గర సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అతివేగంతో వస్తున్న లారీ బ్రిడ్జిని ఢీకొట్టడంతో లారీ అదుపు తప్పి లోయలో పడింది. లారీ డ్రైవర్ అక్కడిక్కడే ప్రాణాలను కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పుతున్నారు.