ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై అత్యాచారం ఘటన మరువక ముందే మన రాష్ట్రంలో అటువంటి సంఘటనే జరిగింది.
మెదక్: ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై అత్యాచారం ఘటన మరువక ముందే మన రాష్ట్రంలో అటువంటి సంఘటనే జరిగింది. అయితే అక్కడ బస్సు అయితే, ఇక్కడ లారీ. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన ఓ యువతి హైదరాబాద్ వెళ్లేందుకు లారీ ఎక్కింది. మార్గమధ్యంలో లారీడ్రైవర్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి దగ్గర లారీ నుంచి తోసివేశాడు.
తీవ్రంగా గాయపడిన ఆమెను చూసి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.