Hyderabad: శ్మశానవాటికలో యువతిపై లైంగికదాడి | Molestation on Young Woman in Graveyard Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: శ్మశానవాటికలో యువతిపై లైంగికదాడి

Published Tue, Nov 1 2022 8:14 AM | Last Updated on Tue, Nov 1 2022 8:54 AM

Molestation on Young Woman in Graveyard Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌(చాంద్రాయణగుట్ట): శ్మశానవాటికలో యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జీఎం చావునీకి చెందని ఇబ్రహీంబేగ్‌ (24), ఉమర్‌ బేగ్‌(20) అన్నదమ్ముల పిల్లలు. స్థానికంగానే ఉండే మతిస్థిమితం లేని ఓ మహిళ (30)తో ఇబ్రహీంకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకొని ఆమెపై లైంగిక దాడి చేద్దామని అన్నదమ్ములు పథకం పన్నారు.

ఈ క్రమంలోనే ఇబ్రహీం శనివారం యువతిని పిలిపించుకొని బైక్‌పై తిప్పుతూ జీఎం చావునీలో ఓ శ్మశాన వాటికలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. అనంతరం ఉమర్‌కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనపై యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

చదవండి: (జూనియర్‌ ఆర్టిస్ట్‌ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో..) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement