అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కనగానపల్లి మండలం సీతారాంపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. డ్రైవర్ పరిస్ధితి విషమంగా ఉంది.
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కనగానపల్లి మండలం సీతారాంపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. కర్ణాటక రాష్ట్రం బిజాపూర్‌కు చెందిన లారీ బెంగుళూరు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. లారీ పక్క నుంచి ఇండికా కారులో వచ్చిన దుండగులు కారులో నుంచే డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. లారీ డ్రైవర్ సురేష్ డొక్కలో ఆరు బుల్లెట్లు దూసుకుపోయాయి. బుల్లెట్ల దెబ్బకు సురేష్ పక్కకు ఒరిగిపోవడంతో క్లీనర్ లారీని సమయస్ఫూరితో ఆపేశాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రుని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు కారణాలు తెలియరాలేదు. ధర్మవరం డిఎస్పీ వేణుగోపాల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.