గ్యాస్‌ ట్యాంకు పేలి వ్యాను దగ్ధం | van fire in gas tank blost | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ట్యాంకు పేలి వ్యాను దగ్ధం

Published Thu, Jul 21 2016 12:01 AM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

గ్యాస్‌ ట్యాంకు పేలి వ్యాను దగ్ధం - Sakshi

గ్యాస్‌ ట్యాంకు పేలి వ్యాను దగ్ధం

 గ్యాస్‌ ట్యాంక్‌ పేలి మారుతి ఓమ్ని వ్యాను దగ్ధమైన సంఘటన బుధవారం చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. అనంతపురానికి చెందిన సురేష్‌ అనే వ్యక్తి జాతీయ రహదారి పక్కనే ఉన్న న్యూ రాయలసీమ హోటల్‌ వద్ద తన ఓమ్ని వ్యానును పార్కుచేసి అదే హోటల్‌లో విశ్రాంతి తీసుకున్నాడు. బుధవారం ఉదయం వ్యాను స్టార్ట్‌ కాలేదు. ఇంజిన్‌కు అమర్చిన గ్యాస్‌ ట్యాంక్‌ వద్ద రిపేరు చేస్తుండగా ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చే లోపు ఓమ్ని వ్యాను కాలిపోయింది. సురేష్‌కు సైతం మంటలు వ్యాపించడంతో స్వల్పంగా గాయపడ్డాడు. గ్యాస్‌ ట్యాంక్‌ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement