ఏకంగా ఆర్టీసీ బస్సుకే టెండర్ పెట్టాడు.. | lorry driver caught in escaping with a rtc bus | Sakshi
Sakshi News home page

ఏకంగా ఆర్టీసీ బస్సుకే టెండర్ పెట్టాడు..

Published Fri, Mar 27 2015 10:50 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

lorry driver caught in escaping with a rtc bus

ఆదిలాబాద్: ఓ లారీ డ్రైవర్ ఆర్టీసీ బస్సును చోరీచేసి పారిపోయే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు....ఆదిలాబాద్ జిల్లాలోని తాళమడుగు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ శర్మకి శ్రీకాంత్(30) శుక్రవారం ఉదయం నిర్మల్ డిపో నుంచి ఓ ఖాళీ బస్సును తీసుకుని పరారయ్యాడు.

 

సమాచారం అందుకున్న పోలీసులు నేరడిగొండ మండలం రోడ్డుమాముల టోల్ ప్లాజా వద్ద బస్సుతోపాటు శ్రీకాంత్‌ను పట్టుకున్నారు. ఇక్కడి నుంచి మరో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే మహారాష్ట్ర సరిహద్దు వస్తుంది. బస్సును మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయించాలని శ్రీకాంత్ ప్రయత్నంగా తెలుస్తోంది.  
(నేరడిగొండ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement