లంచం ఇవ్వకుంటే పిస్టల్‌తో కాల్చేస్తా.. ఫారెస్డ్‌ గార్డ్‌ బెదిరింపులు | Forest Guard Threatened Lorry Driver For Money Karnataka | Sakshi
Sakshi News home page

లంచం ఇవ్వకుంటే పిస్టల్‌తో కాల్చేస్తా.. ఫారెస్డ్‌ గార్డ్‌ బెదిరింపులు

Published Wed, Aug 17 2022 2:44 PM | Last Updated on Wed, Aug 17 2022 3:29 PM

Forest Guard Threatened Lorry Driver For Money Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మైసూరు(బెంగళూరు): కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తూ సమాజంలో మంచి పేరుతో పాటు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంటే మరికొందరు లంచానికి ఆశపడుతున్నారు. తాజాగా లంచం కోసం ఓ ఫారెస్ట్‌ గార్డ్‌ హల్‌ చల్‌ చేయగా ఆ వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. అడిగినంత డబ్బు ఇవ్వక పోతే పిస్టల్‌తో కాల్చి వేస్తామని ఫారెస్డ్‌ గార్డు లారీ డ్రైవర్‌ను బెదిరించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

కర్ణాటక–తమిళనాడు సరిహద్దులో పోలార్‌ వద్ద చెక్‌పోస్టు ఉంది. ఇక్కడ విధుల్లో ఉన్న ఫారెస్ట్‌ గార్డు అటుగా వచ్చిన లారీని నిలిపి సోదా చేశాడు.  అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేదంటే పిస్టల్‌తో కాల్చివేస్తామని లారీ డ్రైవర్‌ను డిమాండ్‌ చేశాడు. దృశ్యాలను సదరు లారీ డ్రైవర్‌ సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. సదరు ఫారెస్ట్‌ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు.

చదవండి: వీడియో: తప్పతాగిన సెక్యూరిటీ గార్డు వీరంగం.. లేడీస్‌ హాస్టల్‌లో యువతిపై వికృత చేష్టలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement