మద్నూర్: నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలంలో జాతీయ రహదారిపై సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. హైదరాబాద్ నుంచి జైపూర్‌కు కూల్‌డ్రింక్స్ లోడుతో లారీ వెళ్తుండగా లచ్చన్ గేటు వద్ద గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు లారీని ఆపారు. రోడ్డు పక్కనే ఆపి ఉన్న కారును చూపిస్తూ అది చెడిపోయిందని, అందులో పేషంట్ ఉన్నారని నమ్మబలికారు. అర్జెంటుగా అతడిని ఆస్పత్రికి వెళ్లాలని తొందరపెట్టటంతో లారీ డ్రైవర్ చౌదరి మోహన్‌లాల్ వారిని లారీలోకి ఎక్కమన్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వారు లారీ డ్రైవర్‌ను కత్తులతో బెదిరించారు.
లారీని రోడ్డు పక్కన నిలిపి డ్రైవర్ వద్ద నున్న రూ.34 వేలు, రెండు సెల్ ఫోన్‌లు తీసుకుని పారిపోయారు. దీనిపై బాధితుడు మద్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలు హిందీలో మాట్లాడారని క్రీం కలర్ కారులో వారు పరారయ్యారని లారీ డ్రైవర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆగంతకులంతా 30-35 ఏళ్ల వారేనని తెలిపాడు. అర్ధరాత్రి ఫిర్యాదు రాగానే దొంగల గురించి గాలించడం ప్రారంభించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కాశీనాథ్ తెలిపారు.
సినీ ఫక్కీలో దారి దోపిడీ..
Published Thu, Aug 18 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
Advertisement