
బాలికపై లారీ డ్రైవర్ అత్యాచార యత్నం
గుంటూరు: ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఓ కామాందుడిపై కేసు నమోదు అయింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండల కేంద్రంలో గురువారం ఉదయం వెలుగు చూసింది. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న బాలిక(11)పై అదే గ్రామానికి చెందిన గోపి(25) అనే లారీ డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు సదరు వ్యక్తిని ప్రతిఘటిస్తూ గట్టిగా అరిచింది. దీంతో గోపి సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుడి కోసం గాలింపు చేపట్టారు.