
కొణిజర్ల: లారీకి పైన టార్పాలిన్ కట్టే విషయంలో జరిగిన గొడవ చివరకు క్లీనర్ హత్యకు దారితీసింది. ఏపీలోని కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ పోలోతు నైపురాజు, తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేములవాడకు చెందిన క్లీనర్ రాజు (45)తో కలిసి కాకినాడ నుంచి పామాయిల్ లోడుతో మంథని వెళ్లాడు. అక్కడ సరుకు అన్‌లోడ్ అయిన తర్వాత శనివారం కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ వెళ్లి నూకలు లోడ్ చేసుకుని కాకినాడ బయలుదేరారు.
కరీంనగర్ వచ్చేసరికి లారీకి పైన కట్టిన టార్పాలిన్ తాళ్లు లూజు కావడంతో బిగించాలని డ్రైవర్ సూచించగా క్లీనర్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. క్లీనర్ కత్తితో డ్రైవర్‌పై దాడి చేయబోయాడు. వెంటనే డ్రైవర్ నైపురాజు చాకుతో ఎదురుదాడి చేసి క్లీనర్ పొట్ట చీల్చి వేశాడు. శవాన్ని క్యాబిన్‌లోనే వేసుకుని 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా కొణిజర్ల పొలీస్‌స్టేషన్ ఎదుట లారీ నిలిపేసి పోలీసులకు లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment