అనంతపురం సెంట్రల్ :
లారీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు బతుకు భారమై అతను జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. రైలు కింద దూకి తనువు చాలించాడు. ఈ ఘటన అనంతపురంలోని రామచంద్రనగర్ రైల్వేగేట్ సమీపంలో బుధవారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని ఎర్నాలకొట్టాలలో నివాసముంటున్న కొండయ్య(55) లారీ డ్రైవర్‌గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీంతో చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
లారీ డ్రైవర్ ఆత్మహత్య
Published Thu, Dec 15 2016 1:10 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement