
నరసింగరావు మృతదేహం
విశాఖపట్నం, పీఎం పాలెం(భీమిలి): దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోరవానిపాలెంలో ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... బోరవానిపాలెంకు చెందిన బోయి నరసింగరావు అలియాస్ ఉట్టోడు (45)లారీ డ్రైవర్. సుమారు 5 సంవత్సరాలుగా క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం రాత్రి 10 గంటలకు అందరూ ఇంట్లో నిద్రపోయాక తాను మేడ మీదకు వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు కుటుంబ సభ్యులు మేడ మీద చూడగా అక్కడ కనిపించలేదు. పరిసరాల్లో వెతగ్గా ఓజోన్ ప్రాంతంలోని లే అవుట్‌లో చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుని భార్య కొండమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్‌ఐ రమే‹ష్ దర్యాప్తు చేస్తున్నారని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment