ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఓ లారీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు మండలం మహేశ్వరపురం గ్రామానికి చెందిన మోరు వెంగళరావు అనే లారీ డ్రైవర్ ఏలూరులోని కలెక్టరేట్‌కు వెళ్లి పురుగుల మందు తాగాడు. అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స అందించేలోపే ప్రాణం విడిచాడు. కాగా ఆస్తి కోసం తన సోదరుడు పెడుతున్న వేధింపులను తట్టుకోలేకే వెంగళరావు ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.