ప్రేమలో విఫలమై మనస్తాపంతో.. | Young Man Commits Suicide With Love Failure in West Godavari | Sakshi
Sakshi News home page

ప్రేమలో విఫలమై మనస్తాపంతో..

Published Sat, Dec 28 2019 1:36 PM | Last Updated on Sat, Dec 28 2019 1:36 PM

Young Man Commits Suicide With Love Failure in West Godavari - Sakshi

ఇర్లపాటి నవీన్‌ (28) ఫైల్‌ ,ఇర్లపాటి నవీన్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న తాళ్లపూడి ఎస్సై జి.సతీష్‌

పశ్చిమగోదావరి, తాళ్లపూడి: ప్రేమలో విఫలమై మనస్తాపంతో ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. తాళ్లపూడికి చెందిన ఇర్లపాటి నవీన్‌ (28) గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లిన నవీన్‌ శుక్రవారం ఉదయం తిరిగొచ్చాడు. అనంతరం గోదావరి గట్టు వద్దకు వెళ్లిన నవీన్‌ అక్కడ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అతనిని చికిత్స నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెళ్లి విషయమై యువతి నిరాకరించడం వల్లే నవీన్‌ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిసింది. నవీన్‌ తన మొబైల్‌లో “తాను మోసపోయానని.. ఇంక ఎవరిని ఇలా మోసం చేయవద్దు’ అని పోస్టు పెట్టడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవీన్‌ మృతికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాళ్లపూడి ఎస్సై జి.సతీష్‌ చెప్పారు.

వైసీపీలో చురుకైన యువనేత
వైఎస్సార్‌ సీపీలో నవీన్‌ చురుగ్గా వ్యహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేశారు. అదేవిధంగా జైభీమ్‌ యూత్‌లో పాల్గొంటూ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నాయకులు నవీన్‌ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement