![Young Man Committed Suicide In West Godavari District - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/27/bvrm.jpg.webp?itok=_F6k24Sx)
సాక్షి, పశ్చిమగోదావరి : ప్రేమించిన యువతి మోసం చేసిందనే మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు ప్రేమించిన యువతితో పాటు మరో స్నేహితుడు కారణమంటూ సెల్ఫీ వీడియో తీసి అనంతరం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మూడు రోజుల క్రితం చోటు చేసుకోగా, ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. మృతుడుని జక్కంపూడి కనకారావుగా గుర్తించారు. ప్రేమ పేరుతో యువతి చేసిన మోసాన్ని భరించలేక సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. తన చావుకు కారణమైన వారిని శిక్షించాలని కోరారు. రికార్డు చేసిన వీడియోని బంధువులకు పంపి అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న భీమవరం రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment