
ఇద్దరూ తరచూ ఏకాంతంగా కలుసుకునేవారు. ఏడాది నుంచి విజయప్రియ తంగదురైను దూరంగా పెట్టింది.
అన్నానగర్: ప్రియురాలు ప్రియుడిని కత్తితో నరికి హత్య చేసింది. కళ్లకురిచ్చి జిల్లా శంకరాపురం పక్కన వడపొన్‌పరప్పి సమీపంలోని మనలూర్ గ్రామంలో కల్కువారి చెరువు ఉంది. ఇందులో శుక్రవారం తెల్లవారుజామున గోనె సంచి ఉంది. దానిపై రక్తపు మరకలు ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు వడపరప్పి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తిరుకోవిలూర్ డీఎస్పీ తిరుమేణి, ఇన్‌స్పెక్టర్ పాండియన్, సబ్ ఇన్‌స్పెక్టర్లు ఇళంగోవన్, మాణిక్యం, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గోనెసంచెను స్వాధీనం చేసుకుని చూడగా ఓ యువకుడి మృతదేహం కనిపించింది.
పోలీసుల విచారణలో మనలూరికి చెందిన తంగదురై (21)గా గుర్తించారు. ఇతను అదే ఊరిలో ఉన్న రాళ్ల క్వారీలో లారీ డ్రైవర్. ఆ సమయంలో క్వారీలో పనిచేసే అదే గ్రామానికి చెందిన అయ్యనార్ భార్య విజయప్రియ (29)తో తంగదురైకి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఏకాంతంగా కలుసుకునేవారు. ఏడాది నుంచి విజయప్రియ తంగదురైను దూరంగా పెట్టింది. ఇది తట్టుకోలేని తంగదురై విజయప్రియను తరచూ కలుస్తూ ఎందుకు మాట్లాడడం మానేశావు అంటూ వేధించేవాడు. ఈ స్థితిలో తంగదురై రెండు రోజుల క్రితం మద్యం తాగి విజయప్రియ ఇంటికి వెళ్లాడు.
దీంతో ఆగ్రహించిన విజయప్రియ కత్తితో తంగదురై మెడను కోసేసింది. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం తంగదురై మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి చెరువులో పడేసి ఏమీ తెలియనట్లు నటించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. దీంతో విజయప్రియను పోలీసులు అరెస్టు చేశారు. విజయప్రియ భర్త మూడేళ్లుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. విజయప్రియకు 12 ఏళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉండడం గమనార్హం.