ఇంటిపైకి దూసుకెళ్లిన లారీ | Lorry Roll Overed To House In PSR Nellore | Sakshi
Sakshi News home page

ఇంటిపైకి దూసుకెళ్లిన లారీ

Published Mon, Jul 9 2018 11:56 AM | Last Updated on Mon, Jul 9 2018 11:56 AM

Lorry Roll Overed To House In PSR Nellore - Sakshi

బుచ్చిరెడ్డిపాళెం: లారీ డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడంతో ఓ లారీ  అదుపు తప్పి ఇంటిపైకి దూసుకెళ్లిన ఘటన పట్టణంలోని కామాక్షికాలనీ సమీపంలో ముంబయి జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగింది. కృష్ణపట్నం నుంచి బొగ్గుతో వెళ్తున్న లారీ బుచ్చిరెడ్డిపాళేనికి రాగానే డ్రైవర్‌ కునుకు వేయడంతో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. డ్రైవర్‌ అప్రమత్తమయ్యేలోగా ఓ చెట్టును ఢీకొంది. పక్కనే ఇంటి ముందు భాగాన్ని ఢీకొంది. చెట్లు మొదళ్లతో సహా బయటకు వచ్చింది. ఇంటి ముందు భాగమంతా పూర్తిగా దెబ్బతింది. పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభం నేలకొరిగింది. లారీ బోల్తా పడింది. స్వల్పగాయాల పాలైన డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంటి ముందు భాగంలో ఎవరూ నిద్రించకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement