నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి | Road Accident At Mumbai-Nellore National Highway | Sakshi
Sakshi News home page

Jan 13 2019 8:12 PM | Updated on Jan 13 2019 8:57 PM

Road Accident At Mumbai-Nellore National Highway - Sakshi

సాక్షి, నెల్లూరు: సంక్రాంతి పండగ వేళ నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సంగం మండలం గాంధీ సంఘం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబై-నెల్లూరు నేషనల్‌ హైవేపై లారీ.. బైక్‌ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తులు మద్యం సేవించినట్టుగా వారు పేర్కొన్నారు. మృతులను సంగం మండలానికి చెందిన వెంకటేశ్వర్లు(30), కొడవలూరు మండలం మండలానికి చెందిన నానా సాహెబ్‌(35), దగదర్తి మండలానికి చెందిన రాము(32)లుగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement