ప్రమాదవశాత్తు లారీ డ్రైవర్ మృతి
Published Wed, Mar 22 2017 12:28 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఆదోని టౌన్: ఆలూరు మండలం ఎ. అగ్రహారం వద్ద జరిగిన ఓ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. నంద్యాల పట్టణం ఎంఎస్ నగర్‌లో నివాసముంటున్న లారీ ఓనర్ కం డ్రైవర్ పద్మశాలి పోబాద్రి వెంకటేశ్వర్లు(48), హుసేనాపురానికి చెందిన సుధాకర్ మంగళవారం ఉదయం స్థానిక మిల్లులో పత్తిని లోడ్ చేసుకుని బళ్లారికి బయలుదేరారు. ఆలూరు దాటిన తర్వాత ఎ. అగ్రహారం సమీపంలో పొలం పక్కనే ఉన్న నీళ్ల ట్యాంకు వద్ద నీళ్ల కోసం లారీలను ఆపి ఇద్దరు డ్రైవర్లు కిందకు దిగారు. రహదారి పక్కనే ఒకదాని వెనుక మరో దానిని వరుసగా నిలిపారు. వెనుక నిలిపిన లారీ న్యూట్రల్ కావడం, కొద్దిగా డౌన్ ఉండటంతో ముందుకు కదిలింది. పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు లారీని ఆపే ప్రయత్నం చేస్తుండగా లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఆలూరు ఎస్‌ఐ ధనుంజయ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Advertisement
Advertisement