బైక్ ప్రమాదంలో వ్యక్తి పరిస్థితి విషమం | Man serious condition after Bike accident | Sakshi
Sakshi News home page

బైక్ ప్రమాదంలో వ్యక్తి పరిస్థితి విషమం

Published Wed, Feb 25 2015 9:56 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

Man serious condition after Bike accident

అద్దంకి(ప్రకాశం): వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి లారీ దిగుతున్న డ్రైవర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా, బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శ్రీనివాసనగర్‌లో బుధవారం రాత్రి జరిగింది. వివరాలు..బలికుదవ మండలం కొప్పరపాడు గ్రామానికి చెందిన పొలిశెట్టి సుధాకర్(35) అద్దంకి జాతీయర హదారిపై వేగంగా బైక్ నడుపుకుంటు వెళ్తున్నాడు.

ఈ క్రమంలో టీఫిన్ తీనేందుకు లారీని ఆపి దిగుతున్న డ్రైవర్ సాంబయ్య(50)ను ఢీ కొట్టాడు. దీంతో సాంబయ్యకు స్వల్పగాయాలు కాగా, బైకు నడుపుతున్న సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని వెంటనే ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement