
సాక్షి, హైదరాబాద్: డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై మట్టిన డంప్ చేయడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రాజస్థాన్‌కు చెందిన రామ్‌నరేశ్(32) జయభేరి కన్‌స్ట్రక్షన్ కంపెనీలో కూలీగా పనిచేస్తూ కంపెనీకి చెందిన ఓ షెడ్‌లో నివాసముంటున్నాడు.
ఈనెల 16న రాత్రి 10.30 గంటల సమయంలో షెడ్ సమీపంలోని ఓ చెట్టుకింద రామ్‌నరేశ్ నిద్రిస్తుండగా అది గమనించని టిప్పర్ సిబ్బంది మట్టిని అతనిపై డంప్ చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. భార్య ఫిర్యాదు మేరకు కన్‌స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్యంపై కేసును నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
( చదవండి: ఏం జరిగిందో...తల్లి లేచే చూసేసరికి..)
Comments
Please login to add a commentAdd a comment