పోస్టు ప్రసాద్ పరిస్థితి విషమం
పోస్టు ప్రసాద్ పరిస్థితి విషమం
Published Sat, Mar 25 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM
– హైదరాబాద్‌కు తరలింపు
కర్నూలు: టీడీపీ వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు పోస్టు ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం దాడి జరిగిన వెంటనే అతడిని కర్నూలు గౌరి గోపాల్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల సూచన మేరకు శనివారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో డోన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోస్టుప్రసాద్‌తో పాటు గాయపడిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు నాయకులు ఓబులాపురం గొల్ల మదన్, గొల్ల సుధాకర్, గొల్ల రమణ, పాతపేటకు చెందిన లాల్‌బాషాలు ప్రస్తుతం కర్నూల్‌లోని అమృత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కర్నూలు చికిత్స పొందుతున్న సమయంలో పోస్టు ప్రసాద్‌ను పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పరామర్శించారు.
Advertisement
Advertisement