నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది: సీఎం జగన్‌ | AP CM YS Jagan Public Meeting At Dhone | Nandyal District - Sakshi
Sakshi News home page

నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది: సీఎం జగన్‌

Published Tue, Sep 19 2023 1:15 PM | Last Updated on Tue, Sep 19 2023 5:00 PM

CM YS Jagan Public Meeting At Nandyal District Dhone - Sakshi

సాక్షి, నంద్యాల/డోన్‌: రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు కాబట్టే సాగునీరు, తాగు నీరు అందించే చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది అని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదని ప్రజలకు గుర్తు చేశారు సీఎం జగన్‌. 

కాగా, ముఖ్యమంత్రి జగన్‌ డోన్‌ సభలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నమ్మకం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. చంద్రబాబు ఉద్దేశ్యం రాష్ట్రాన్ని దోచుకోవడం. దోచుకున్నది వీళ్లతో పంచుకోవడం. అలా పంచుకుంటే ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించే ప్రసక్తే ఉండదు. ఇవన్నీ ఈనాడు రాయదు.. చూపించదు. ఒక ఆంధ్రజ్యోతి చంద్రబాబు కోసం ఢంకా భజాయిస్తుంది. ఒక టీవీ5 చంద్రబాబు ఎంత దారుణంగా పాలన చేసి బ్రహ్మండంగా చేసిందని చెబుతుంది. ఇలా దుర్మార్గమైన ఆలోచనతో చేసిందే చంద్రబాబు పాలనంతా. టీడీపీ హయంలో జరిగిదంతా.. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. దోచుకోవడం గ్రామస్థాయిలో​ జన్మభూమి కమిటీలో ప్రారంభమైతే.. చివరకు దత్తపుత్రుడి షేరింగ్‌తో ఎండ్‌ అవుతుంది’

సీమ కష్టాలు మీ బిడ్డకు తెలుసు..
రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు. కరువు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. కర్నూలు, నంద్యాల జిల్లాలకు మెట్ల ప్రాంతాలకు సాగు నీరు అందుతుంది. లక్కసాగరం పంప్‌హౌస్‌ ద్వారా 77 చెరువులకు నీరు అందుతుంది. హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి చెరవులకు నీటి కేటాయింపు జరిగింది. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదు. ఎన్నికలకు 4 నెలలకు ముందు చంద్రబాబు జీవోలు, శంకుస్థాపనలు చేశారు. ప్రాజెక్ట్‌ కోసం భూమిని కూడా కొనుగోలు చేయలేదు. కేవలం టెంకాయలు కొట్టడానికి ఏదో నామ మాత్రంగా 8 ఎకరాలు కొనుగోలు చేశారు. 

అధికారంలోకి రాగానే ప్రాజెక్ట్‌లు పూర్తి చేశాం..
నా సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూశాను. అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకున్నాను. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. హంద్రీనీవాను దివంగత మహానేత వైఎస్సార్‌ పూర్తి చేశారు. ఆ మహానేత బిడ్డ హయాంలో ప్రజలకు మంచి జరుగుతోంది.  అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్‌ల పూర్తికి చర్యలు తీసుకున్నాం. రూ. 253 కోట్లతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం. డోన్‌, పత్తికొండ నియోజకవర్గాలకు మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం ప్రాజెక్ట్‌లను పట్టించుకోని పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ లిఫ్ట్‌ పనులు చేపట్టాం. వెలుగొండ ప్రాజెక్ట్‌ను వడివడిగా పూర్తి చేస్తున్నాం. రెండో టన్నెల్‌ పూర్తి చేసి అక్టోబర్‌లో ప్రారంభిస్తున్నాం. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది మన ప్రభుత్వం. 

మీ బిడ్డ ప్రభుత్వంలో తేడాను గమనించండి..
గతంలో ఇదే బడ్జెట్‌. అప్పటి కంటే ఇప్పుడు అప్పులు తక్కువ చేశాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2లక్షల35వేల కోట్లు జమ చేశాం. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది?. మా ఊరిలో స్కూళ్లను, ఆసుపత్రులను గమనించండి. వైద్య, విద్య, సంక్షేమంలో మన ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. దొంగల ముఠా అబద్దాలు, మోసాలను ప్రజలు నమ్మవద్దు. ఈ ముఠా రానున్న కాలంలో మరిన్ని అబద్దాలను వడ్డిస్తుంది. మన ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అన్నది ఆలోచించండి. మీ ఇంట్లో మంచి జరిగిందనుకుంటే మీ బిడ్డను ఆశీర్వదించండి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement