Handri neeva canel
-
నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది: సీఎం జగన్
సాక్షి, నంద్యాల/డోన్: రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు కాబట్టే సాగునీరు, తాగు నీరు అందించే చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది అని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదని ప్రజలకు గుర్తు చేశారు సీఎం జగన్. కాగా, ముఖ్యమంత్రి జగన్ డోన్ సభలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నమ్మకం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. చంద్రబాబు ఉద్దేశ్యం రాష్ట్రాన్ని దోచుకోవడం. దోచుకున్నది వీళ్లతో పంచుకోవడం. అలా పంచుకుంటే ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించే ప్రసక్తే ఉండదు. ఇవన్నీ ఈనాడు రాయదు.. చూపించదు. ఒక ఆంధ్రజ్యోతి చంద్రబాబు కోసం ఢంకా భజాయిస్తుంది. ఒక టీవీ5 చంద్రబాబు ఎంత దారుణంగా పాలన చేసి బ్రహ్మండంగా చేసిందని చెబుతుంది. ఇలా దుర్మార్గమైన ఆలోచనతో చేసిందే చంద్రబాబు పాలనంతా. టీడీపీ హయంలో జరిగిదంతా.. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. దోచుకోవడం గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలో ప్రారంభమైతే.. చివరకు దత్తపుత్రుడి షేరింగ్‌తో ఎండ్ అవుతుంది’ సీమ కష్టాలు మీ బిడ్డకు తెలుసు.. రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు. కరువు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. కర్నూలు, నంద్యాల జిల్లాలకు మెట్ల ప్రాంతాలకు సాగు నీరు అందుతుంది. లక్కసాగరం పంప్‌హౌస్ ద్వారా 77 చెరువులకు నీరు అందుతుంది. హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి చెరవులకు నీటి కేటాయింపు జరిగింది. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదు. ఎన్నికలకు 4 నెలలకు ముందు చంద్రబాబు జీవోలు, శంకుస్థాపనలు చేశారు. ప్రాజెక్ట్ కోసం భూమిని కూడా కొనుగోలు చేయలేదు. కేవలం టెంకాయలు కొట్టడానికి ఏదో నామ మాత్రంగా 8 ఎకరాలు కొనుగోలు చేశారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్ట్‌లు పూర్తి చేశాం.. నా సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూశాను. అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకున్నాను. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. హంద్రీనీవాను దివంగత మహానేత వైఎస్సార్ పూర్తి చేశారు. ఆ మహానేత బిడ్డ హయాంలో ప్రజలకు మంచి జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్‌ల పూర్తికి చర్యలు తీసుకున్నాం. రూ. 253 కోట్లతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం. డోన్, పత్తికొండ నియోజకవర్గాలకు మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం ప్రాజెక్ట్‌లను పట్టించుకోని పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టాం. వెలుగొండ ప్రాజెక్ట్‌ను వడివడిగా పూర్తి చేస్తున్నాం. రెండో టన్నెల్ పూర్తి చేసి అక్టోబర్‌లో ప్రారంభిస్తున్నాం. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది మన ప్రభుత్వం. మీ బిడ్డ ప్రభుత్వంలో తేడాను గమనించండి.. గతంలో ఇదే బడ్జెట్. అప్పటి కంటే ఇప్పుడు అప్పులు తక్కువ చేశాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2లక్షల35వేల కోట్లు జమ చేశాం. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది?. మా ఊరిలో స్కూళ్లను, ఆసుపత్రులను గమనించండి. వైద్య, విద్య, సంక్షేమంలో మన ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. దొంగల ముఠా అబద్దాలు, మోసాలను ప్రజలు నమ్మవద్దు. ఈ ముఠా రానున్న కాలంలో మరిన్ని అబద్దాలను వడ్డిస్తుంది. మన ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అన్నది ఆలోచించండి. మీ ఇంట్లో మంచి జరిగిందనుకుంటే మీ బిడ్డను ఆశీర్వదించండి. -
దేశంలోనే అతిపెద్ద గోల్ గుమ్మజ్ !
కర్నూలు కల్చరల్: కర్నూలు నగరంలోని గోల్ గుమ్మజ్ ఒక ముఖ్యమైన పురాతన కట్టడం. నగరంలోని హంద్రీ నది ఒడ్డున ఉస్మానియా కళాశాల పక్కన గల గోల్ గుమ్మజ్ నిర్మాణం అందరినీ అబ్బుర పరుస్తుంది. ఇది దేశంలో కెల్లా అతి పెద్ద గోల్ గుమ్మజ్‌గా పేరు గాంచింది. అగ్రాలోని తాజ్‌మహల్, బీజాపూర్‌లోని గోల్ గుమ్మజ్‌లను పరిశీలించినా అంత పెద్దగా లేనట్లు తెలుస్తుంది. దీన్ని నిర్మించి 400 సంవత్సరాలు కావస్తున్నా గుమ్మజ్ చెక్కుచెదరలేదు. రాయిరాయి అమర్చి అతిపెద్ద గోల్ గుమ్మజ్ నిర్మించడం ఆనాటి ఇంజినీర్ల నైపుణ్యతకు అద్దం పడుతుంది. ఈ గుమ్మజ్‌ను 388 సంవత్సరాల క్రితం మొగల్ చక్రవర్తి ఔరంగజేబు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఆయన పాలనలో జిల్లా గవర్నర్‌గా ఉన్న అబ్దుల్ వహబ్ సాహెబ్ తన గురువు సయ్యద్ కరీముల్లా ఖాద్రీ కోరిక మేరకు దీన్ని నిర్మించినట్లు ముస్లిం పెద్దలు చెబుతుంటారు. 1958వ సంవత్సరంలో పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు జిల్లా అధికారులు కృషి చేస్తున్నారు. -
ప్రాణం తీసిన సరదా
చిత్తూరు, బి.కొత్తకోట: కృష్ణా జలాల్లో దిగాలన్న ఓ చిన్నారి కోరిక మృత్యుశాపమైంది. సహచరులతో కలిసి కాలువలో దిగిన అతడు మునిగిపోయి తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. కుటుంబ సభ్యులకు అంతులేని దుఃఖాన్ని మిగిల్చాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు..మండలంలోని వాయలవంకకు చెందిన షేక్ మహమ్మద్ హుసేన్ కుమారుడు షేక్ మహమ్మద్ అక్మల్ (9) స్థానిక ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. అక్మల్‌కు ప్రతి శుక్రవారం మసీదుకు వెళ్లి నమాజు చేసే అలవాటు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటి నుంచి వెళ్లిన అక్మల్ సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లి ఉంటాడని తల్లిదండ్రులు భావించారు. అయితే అక్మల్‌తో పాటు మరో ముగ్గురు చిన్నారులు బి.కొత్తకోట శివారులోని హంద్రీ–నీవా కాలువలో పారుతున్న కృష్ణాజలాలు చూసేందుకు వెళ్లారు. కాలువకు కుడివైపున మెషిన్ ఉన్న ప్రాంతం వద్ద గట్టు పైనుంచి అక్మల్ నీటిలోకి దిగాడు. మట్టి బురదగా ఉండటం, నీరుæలోతున్న చోటు కావడంతో అక్మల్ నీటిలో దిగగానే మునిగిపోయాడు. ఇది చూసిన అతని స్నేహితులు భయంతో పట్టణంలోకి పరుగులు తీశారు. అక్మల్ ఇంటికి వచ్చి అతడికి తల్లికి విషయం చెప్పడంతో ఆమె గుండెల్లో రాయి పడినట్లైంది. కుటుంబీకులు ఆందోళనతో కాలువ వద్దకు చేరుకుని 45 నిమిషాల పాటు గాలించారు. నీటిలో మునిగిపోయిన అక్మల్‌ను వెలికితీశారు. కొనఊపిరితో ఉన్నట్టు గుర్తించి స్థానిక పీహెచ్‌సీకి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అక్మల్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనితో మృతదేహాన్ని ఇంటికి తరలించారు. విషాదంలో వాయలవంక అక్మల్ మృతి గురించి తెలుసుకున్న వాయలవంక వాసులు కన్నీటిపర్యంతమయ్యారు. దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న అతడి తల్లిదండ్రులు, తాతను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఎంపీపీ పాగొండ ఖలీల్, కాంగ్రెస్ ఇన్చార్జ్ చంద్రశేఖర్‌రెడ్డి, కో–ఆప్షన్ సభ్యుడు బావాజాన్, విద్యాశాఖ సిబ్బంది అక్మల్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
హంద్రీనీవా కాల్వకు గండి, భారీగా లీకవుతున్న నీరు
కర్నూలు: నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు వద్ద హంద్రీనీవా కాల్వకు మంగళవారం గండిపడింది. దాంతో భారీగా నీరు లీకవుతున్నడంతో పంటపొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. హంద్రీనీవా కాల్వకు గండిపడటంతో మూడు మోటార్లను నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. అయితే నాణ్యత లోపం వల్లే హంద్రీనీవా కాల్వకు గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు.