విజిలె¯Œ్స అండ్ ఎ¯ŒSఫోర్స్‌మెంట్ శాఖ ఈ ఏడాది రూ.319.28 కోట్లు అక్రమార్కుల చేతుల్లోకి పోకుండా కాపాడగలిగారు. జిల్లా విజిలె¯Œ్స, ఎ¯ŒSఫోర్స్‌మెంట్ అధికారి టి.రామప్రసాదరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది అక్రమ
-
ఈ ఏడాది రూ.319.28 కోట్ల ఆదాయం
-
జిల్లా విజిలెన్స్ అధికారి రామప్రసాదరావు
రాజమహేంద్రవరం క్రైం :
విజిలె¯Œ్స అండ్ ఎ¯ŒSఫోర్స్‌మెంట్ శాఖ ఈ ఏడాది రూ.319.28 కోట్లు అక్రమార్కుల చేతుల్లోకి పోకుండా కాపాడగలిగారు. జిల్లా విజిలె¯Œ్స, ఎ¯ŒSఫోర్స్‌మెంట్ అధికారి టి.రామప్రసాదరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది అక్రమ లేఅవుట్లు, అక్రమ ఎరువులు, పురుగుమందులు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, విద్యాసంస్థల ప్రాపర్టీ టాక్స్ బకాయిలు, గుట్కా నిల్వలు తదితర వాటిపై దాడులు జరిపి, రూ.115.28 కోట్లను ప్రభుత్వానికి సమకూర్చారు. ఎఫ్‌సీఐ, ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేష¯ŒS వారి బియ్యం, ధాన్యం కొనుగోళ్లపై అగ్రికల్చరల్ మార్కెట్ ఫీజు, రైస్ మిల్లులో వ్యాట్ ఎగవేత, రుచి సోయా పరిశ్రమ(కాకినాడ), అందాని, లోహియా ఆయిల్ పరిశ్రమలో వ్యాట్, కలప డిపోల్లో, జీడిపిక్కల పరిశ్రమల్లో, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు ఎగవేసిన పన్నులు రూ.130.72 కోట్లు గుర్తించి, ప్రభుత్వానికి నివేదిక పంపారు. గుజ్జనపూడిలో నిబంధనలకు విరుద్ధంగా లాటరైట్ మైనింగ్‌ను గుర్తించారు. అర్లధార, రావికంపాడు, ధవళేశ్వరం నుంచి లాటరైట్ స్టాక్ యార్డ్‌లను తనిఖీలు చేసి, అపరాధ రుసుముపై నివేదిక పంపారు. గ్రావెల్ క్వారీల అక్రమాలను గుర్తించి, ప్రభుత్వానికి రావలసిన రూ.73.79 కోట్లు వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు సిఫారసు చేశారు.
ప్రజాపంపిణీలో అవకతవకలు
జిల్లాలో రేష¯ŒS సరఫరాలో అవకతవకలపై తనిఖీలు చేసి, రూ.14,05,984 విలువైన పీడీఎస్ బియ్యం, రూ.22,83,55,258 విలువైన బియ్యం, ఇతర సరుకులు, రూ.39,86,653 విలువైన ఎల్‌పీజీ, ఆయిల్, కిరోసిన్, రూ.1,47,477 విలువైన పప్పులు, వంటనూనె, నిత్యావసరాలు.. మొత్తం రూ.23.52 కోట్ల విలువైన సరుకులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 74 కేసులు నమోదు చేశారు.
నాణ్యత లోపాలు
ఇంజనీరింగ్ పనుల్లో అవకతవకలు, నాణ్యత లోపాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు నివేదిక పంపించారు. పోలవరం ప్రాజెక్టు ప్ర«ధాన ఎడమ కాలువ ప్యాకేజీ–5, గోదావరి పుష్కరాలు, గోదావరి గట్టు పటిష్టత తదితర పనుల బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు, గోదావరి డెల్టాలోని ఉభయ గోదావరి జిల్లాల్లో రబీ సాగుకు ఎత్తిపోతల ద్వారా నీటి సరఫరా పనులు తదితర వాటిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.