నగల కోసం మహిళపై ఆటో డ్రైవర్ దాడి
Published Sun, Nov 13 2016 10:43 PM | Last Updated on Thu, Oct 4 2018 5:34 PM
ఉప్పలగుప్తం :
ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళపై ఆటో డ్రైవర్ దాడిచేసి దోపిడీకి ప్రత్నించిన సంఘటన ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో శనివారం రాత్రి జరిగింది. ఎస్‌సై డి.రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... అమలాపురం నుంచి ఎ¯ŒS.కొత్తపల్లికి వస్తున్న ఆటోలో ఎరవ్రంతెన వద్ద గొల్లవిల్లికి చెందిన మేడిద నాగలక్ష్మి ఎక్కింది. అనాతవరం మీదుగా వచ్చిన ఆటోలో ఆమె తప్ప ప్రయాణికులు లేకపోవడంతో డ్రైవరు ఆటోను భీమనపల్లి నుంచి చెయ్యేరు వైపు మళ్ళించాడు. దీంతో నాగలక్ష్మి ఇటు ఎక్కడికంటూ ప్రశ్నించగా, ఆటోలో బియ్యం బస్తా ఉంది ఎదర దింపాలని చెప్పాడు. నిర్జన ప్రదేశానికి ఆటో పోనిచ్చి.. బంగారు ఆభరణాలు తీసి ఇవ్వాలంటూ ఆమెపై దాడికి ప్రయత్నించాడు. దీంతో నాగలక్ష్మి కేకలు పెట్టడంతో నోరునోక్కి పక్కనున్న తోటలోకి లాక్కుంటూ వెళ్ళాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న ముమ్మిడివరం జెడ్పీటీసీ సభ్యుడు శీలం సత్యనారాయణ ఆమె కేకలు విని తన మోటారు సైకిల్‌ను తోటలోకి పోనివ్వడంతో ఆ వెలుతురుకు మహిళను వదలి ఆటో డ్రైవర్ పరారయ్యాడు. ఆమెను రక్షించిన సత్యనారాయణ ఉప్పలగుప్తం జెడ్పీటీసీ సభ్యుడు దేశంశెట్టి వెంకట లక్ష్మినారాయణకు విషయాన్ని ఫో¯ŒSలో వివరించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆయన నాగలక్ష్మి నుంచి వివరాలు తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నామని ఎస్‌సై రమేష్‌బాబు తెలిపారు. ఆదివారం ఉదయం సంఘటన జరిగిన ప్రదేశాన్ని ఎస్‌సై రమేష్‌బాబు పరిశీలించి, జెడ్పీటీసీ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Advertisement