బీజింగ్ : గాలిలో (విమాన) ప్రయాణమంటే...మన జీవితం గాల్లో దీపం లాంటిదే అని భయపడిపోతున్న విమాన ప్రయాణికుల వెన్నులో వణుకుపుట్టించే వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉండగానే పైలట్ నిద్రపోయాడు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అధికారులు, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే మానవ తప్పిదానికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేది. చైనాలో బుధవారంలో ఈ ఘటన చేటుకుంది.
బోయింగ్ 747 విమానం 35వేల అడుగుల ఎత్తున ఎగురుతున్న సమయంలో కాక్‌పిట్‌లో పైలట్ ఉన్నట్టుండి నిద్రపోయాడు. పక్కనే కో పైలట్ మౌనంగా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై చైనా విమానయాన అధికారులు తక్షణమే స్పందించారు. పైలట్లు ఇద్దరినీ తొలగిస్తున్నట్టు ప్రకటించారు.
తైవాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పైలట్ వెంగ్ జియాఘిగా ఇతణ్ని గుర్తించారు. అలసిపోవడం సహజమే అయినా..20 సంవత్సరాల అనుభవం వున్న సీనియర్ పైలట్‌గా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఎయిర్‌లైన్స్ అధికారులు వ్యాఖ్యానించారు. కనీసం క్రూ మెంబర్స్ కైనా సమాచారం అందించి వుండాల్సిందని పేర్కొన్నారు.
కాగా వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక లోపాలకుతోడు సెల్ఫీ మోజులో లేదా సిగరెట్ ముట్టించిన కారణంగా సంభవించిన ఘోర విమాన ప్రమాదాలు భారీ విషాదాన్ని నింపుతున్న తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment