china airlines
-
రూ. 83 లకే విమాన టికెట్: అదిరిపోయే ట్విస్ట్ ఏమిటంటే..!
పండుగల సందర్భంగా చాలా విమానయాన సంస్థలు తక్కువ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులో ఉంచుతాయి. ఈ క్రమంలోనే ఒక డాలరు కంటే (రూ. 83) తక్కువకే దిగి రావడం వైరల్‌గా మారింది. అదీ కొన్ని ఖరీదైన రూట్లలో కూడా కేవలం రూ. 114లకే విమాన టికెట్లు అందుబాటులోకి రావడంతో జనం ఎగబడ్డారు. తొలుత ఫేక్ వెబ్సైట్ అని కొంత తటపటాయించారు. కానీ అది ప్రముఖ వెబ్సైట్ అని ధృవీకరించుకున్న తరువాత టికెట్లను భారీగా కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. అంతేకాదు డాలరు కంటే తక్కువ ధరకే విమాన టికెట్లు అంటూ బుకింగ్ స్క్రీన్ షాట్లతో సోషల్ మీడియాలో హోరెత్తించారు. దీంతో విషయం తెలిసిన సంస్థ రంగంలోకి దిగింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని సదరన్ ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లో విమాన ఛార్జీలు ఉన్నదానికంటే తక్కువకే దర్శనమిచ్చాయి. గాంగ్జూ ప్రావిన్స్ కేంద్రంగా పనిచేసే చైనా సదరన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన వెబ్సైట్లో దాదాపు 2 గంటలపాటు టెక్నికల్ సమస్య ఏర్పడింది. ఈ లోపం కారణంగా చెంగ్డూ నుండి షాంఘై వంటి కొన్ని రూట్లు 1.37 డాలర్లకంటే (రూ. 114) తక్కువ ధరల్ని ప్రదర్శించాయి. ఎయిర్‌లైన్ యాప్, వివిధ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫారమ్లలోకూడాఇలానే కనిపించింది. చైనాలో అత్యంత రద్దీగా ఉండే ఆన్లైన్ షాపింగ్ కాలం కావడంతో కొనుగోలు దారులు క్యూ కట్టారు. అయినా చెల్లుతాయి అసాధారణ రద్దీతోపాటు ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన సంస్థ టెక్నికల్ సమస్యను ఆలస్యంగా గుర్తించింది. ట్విస్ట్ ఏంటంటే ధరలతో సంబంధం లేకుండా, సాంకేతిక లోపం సమయంలో కొనుగోలు చేసిన అన్ని టిక్కెట్లూ చెల్లుతాయని ప్రయాణికులకు హామీ ఇవ్వడం విశేషంగా నిలిచింది. ఈ మేరకు చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ అధికారిక వీబో సోషల్ మీడియా ఖాతాలో స్పందించింది. అయితే గతంలో జపాన్‌కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్వేస్లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కానీ తప్పుగా ప్రాసెస్ అయిన టికెట్లు చెల్లవని, సంబంధిత టికెట్ల సొమ్మును వాపసు ఇస్తామని ప్రకటించింది. -
లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ
బీజింగ్: దక్షిణ చైనాలోని గువాంగ్ డాంగ్ ప్రావిన్స్ ఎయిర్ పోర్టులో ఒకామె తన లోదుస్తుల్లో ఐదు బ్రతికున్న పాములను అక్రమంగా తరలిస్తూ పట్టుబడింది. ఆమె శరీరాకృతి విచిత్రంగా ఉండటంతో అనుమానం వచ్చి శెంజిన్ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. అదేంటో.. ప్రపంచంలో చిత్ర విచిత్రమైన సంఘటనలన్నీ చైనాలోనే చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్ పోర్టుల్లో ఈ విధంగా జీవులను తరలిస్తున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఇలాంటి కేసుల్లో అత్యధిక స్మగ్లర్లు బ్యాగుల్లో, బాక్సుల్లో లేదా మరో విధంగా వాటిని తరలిస్తూ ఉంటారు. కానీ ప్రమాదకరంగా విషపూరితమైన సర్పాలను శరీరంలో దాచుకుని తరలించిన సంఘటనలు చాలా అరుదు. కస్టమ్స్ అధికారులు పేరు చెప్పడానికి నిరాకరించిన దక్షిణాఫ్రికాకు చెందిన సదరు మహిళ సజీవంగా ఉన్న ఒక్కో పాముని ఒక్కో స్టాకింగ్ లో పెట్టి ప్యాక్ చేసింది. ఆ ఐదు స్టాకింగ్ బ్యాగులను తన ఛాతీ వద్ద లోదుస్తుల్లో జాగ్రత్తగా పెట్టుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా యధాతధంగా పైన డ్రెస్ వేసుకుంది. ఆమె ఎయిర్ పోర్టులోకి అడుగుపెడుతూనే కస్టమ్స్ అధికారులకు ఆమె ఆకృతి చూసి అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను అడ్డగించి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఐదు పాములను జెర్రిపోతులుగా గుర్తించి వాటిని జంతు సంరక్షణ శాలకు తరలించారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్ లో హిందూ దేవాలయంపై దాడి.. పబ్జీ లవ్ స్టోరీనే కారణమా? -
కాక్‌పిట్‌లోనే.. అలా దొరికిపోయాడు
బీజింగ్ : గాలిలో (విమాన) ప్రయాణమంటే...మన జీవితం గాల్లో దీపం లాంటిదే అని భయపడిపోతున్న విమాన ప్రయాణికుల వెన్నులో వణుకుపుట్టించే వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉండగానే పైలట్ నిద్రపోయాడు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అధికారులు, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే మానవ తప్పిదానికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేది. చైనాలో బుధవారంలో ఈ ఘటన చేటుకుంది. బోయింగ్ 747 విమానం 35వేల అడుగుల ఎత్తున ఎగురుతున్న సమయంలో కాక్‌పిట్‌లో పైలట్ ఉన్నట్టుండి నిద్రపోయాడు. పక్కనే కో పైలట్ మౌనంగా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై చైనా విమానయాన అధికారులు తక్షణమే స్పందించారు. పైలట్లు ఇద్దరినీ తొలగిస్తున్నట్టు ప్రకటించారు. తైవాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పైలట్ వెంగ్ జియాఘిగా ఇతణ్ని గుర్తించారు. అలసిపోవడం సహజమే అయినా..20 సంవత్సరాల అనుభవం వున్న సీనియర్ పైలట్‌గా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఎయిర్‌లైన్స్ అధికారులు వ్యాఖ్యానించారు. కనీసం క్రూ మెంబర్స్ కైనా సమాచారం అందించి వుండాల్సిందని పేర్కొన్నారు. కాగా వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక లోపాలకుతోడు సెల్ఫీ మోజులో లేదా సిగరెట్ ముట్టించిన కారణంగా సంభవించిన ఘోర విమాన ప్రమాదాలు భారీ విషాదాన్ని నింపుతున్న తెలిసిందే. ఒక్క సిగరెట్.. 51 మందిని బలి తీసుకుంది -
సుష్మా మళ్లీ స్పందించారు...
న్యూఢిల్లీ: తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలపై వేగంగా స్పందించే సుష్మా స్వరాజ్ మరోసారి చొరవ తీసుకున్నారు. షాంగై పుడోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చైనా ఎయిర్‌లైన్ సంస్థ భారతీయుల పట్ల అమర్యాదరంగా వ్యవహరించిందని వచ్చిన ఆరోపణలపై చైనాకు భారత్ ఫిర్యాదు చేసింది. భారత ప్రయాణీకుడి ఆరోపణల నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ మేరకు స్పందించింది. చహల్ అనే భారత ప్రయాణీకుడు ఈనెల 6న న్యూఢిల్లీనుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళుతూ షాంగై పుడోంగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆగి తదుపరి విమానం కోసం వేచిచూశారు. ఇదే విషయమై సంబంధిత అధికారితో మాట్లాడగా ఆయన తనపై కేకలు వేస్తూ అమర్యాదకరంగా వ్యవహరించారని చహల్ ఆరోపించారు. చైనా అధికారి వ్యవహార శైలి చూస్తే భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలతో ఆయన ప్రభావితమైనట్టుగా ఉందన్నారు. తనకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ ఆయన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. మంత్రి చొరవతో ఈ అంశాన్ని చైనా విదేశాంగ శాఖ, పుడోంగ్ ఎయిర్పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు భారత అధికారులు తెలిపారు.అయితే ఈ ఆరోపణలను చైనా ఈస్ర్టన్ ఎయిర్‌లైన్స్ తోసిపుచ్చింది. సంబంధింత మెటీరియల్స్, ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన మీదట ఈ ఆరోపణలు నిరాధారమని తేలినట్టు ఆ సంస్థ పేర్కొంది.