బీజింగ్: దక్షిణ చైనాలోని గువాంగ్ డాంగ్ ప్రావిన్స్ ఎయిర్ పోర్టులో ఒకామె తన లోదుస్తుల్లో ఐదు బ్రతికున్న పాములను అక్రమంగా తరలిస్తూ పట్టుబడింది. ఆమె శరీరాకృతి విచిత్రంగా ఉండటంతో అనుమానం వచ్చి శెంజిన్ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది.
అదేంటో.. ప్రపంచంలో చిత్ర విచిత్రమైన సంఘటనలన్నీ చైనాలోనే చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్ పోర్టుల్లో ఈ విధంగా జీవులను తరలిస్తున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి.
సాధారణంగా ఇలాంటి కేసుల్లో అత్యధిక స్మగ్లర్లు బ్యాగుల్లో, బాక్సుల్లో లేదా మరో విధంగా వాటిని తరలిస్తూ ఉంటారు. కానీ ప్రమాదకరంగా విషపూరితమైన సర్పాలను శరీరంలో దాచుకుని తరలించిన సంఘటనలు చాలా అరుదు.
కస్టమ్స్ అధికారులు పేరు చెప్పడానికి నిరాకరించిన దక్షిణాఫ్రికాకు చెందిన సదరు మహిళ సజీవంగా ఉన్న ఒక్కో పాముని ఒక్కో స్టాకింగ్ లో పెట్టి ప్యాక్ చేసింది. ఆ ఐదు స్టాకింగ్ బ్యాగులను తన ఛాతీ వద్ద లోదుస్తుల్లో జాగ్రత్తగా పెట్టుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా యధాతధంగా పైన డ్రెస్ వేసుకుంది.
ఆమె ఎయిర్ పోర్టులోకి అడుగుపెడుతూనే కస్టమ్స్ అధికారులకు ఆమె ఆకృతి చూసి అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను అడ్డగించి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఐదు పాములను జెర్రిపోతులుగా గుర్తించి వాటిని జంతు సంరక్షణ శాలకు తరలించారు.
ఇది కూడా చదవండి: పాకిస్తాన్ లో హిందూ దేవాలయంపై దాడి.. పబ్జీ లవ్ స్టోరీనే కారణమా?
Comments
Please login to add a commentAdd a comment