పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) ఎయిరిండియా (ఏఐ)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానంలో భద్రతా లోపాలపై ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్, విమానం రక్షణ విభాగాధిపతికి ఏప్రిల్ 21న షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
ఎయిరిండియాకు చెందిన ఓపైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి తన స్నేహితురాల్ని కాక్‌పిట్‌లో కూర్చోబెట్టుకున్నాడు. దీనిపై ఎయిరిండియా సకాలంలో స్పందిచకపోవడంపై డీజీసీఏ మండిపడింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎయిరిండియా విమానంలో అసలేం జరిగింది
ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా 915 విమానానికి చెందిన పైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. ప్రయాణం ముగిసే వరకు అక్కడే కూర్చోపెట్టుకున్నాడు. అయితే ఈ ఘటనపై మార్చి 3న కేబిన్ సూపర్‌వైజర్ ఎయిరిండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పట్టించుకోకపోవడంతో డీజీసీఏని ఆశ్రయించారు.
దీంతో డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించిన ఎయిరిండియా 915 విమానం పైలెట్ కమాండ్ కెప్టెన్ హర్ష్ సూరీ, కేబిన్ క్రూ, కాక్‌పిట్‌లో కూర్చున్న ఎకానమీ క్లాస్ ప్రయాణికురాలికి సమన్లు అందించింది. కాగా, సకాలంలో జోక్యం, చర్యలు తీసుకోకపోవడం విజిల్ బ్లోయర్ ఈ విషయాన్ని డీజీసీఏకి చెప్పాల్సి వచ్చినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
మహిళా సిబ్బందిపై వేధింపులు
సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్, విమానం రక్షణ విభాగాధిపతి హెన్రీ డోనోహోకు పంపిన నోటీసులో ఫిర్యాదు దారుడు మాట్లాడుతూ.. కమాండర్‌ని బెదిరించడం, అవమానించడం, తిట్టడం, అసభ్యంగా ప్రవర్తించడంపై చింతిస్తున్నాను. షాక్‌కు గురయ్యాను. మహిళా ప్రయాణీకురాలిని కాక్‌పిట్‌లోకి అనుమతించడాన్ని పైలట్ ఉల్లంఘించడమే కాకుండా, తాను చెప్పినట్లు చేయలేదనే అకారణంగా మహిళా సిబ్బందిని వేదించినట్లు మైలెట్ చేసింది. కాగా, విజిల్ బ్లోయర్ ఫిర్యాదుతో డీజీసీఏ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
చదవండి👉 జీతాలు తక్కువే ఇస్తామంటున్నా.. ఉద్యోగులు ఎగబడుతున్నారు.. కారణం ఇదే!
Comments
Please login to add a commentAdd a comment