
సాక్షి, న్యూఢిల్లీ: విమానంలో కాక్‌పిట్‌లో గొడవపడి ప్రయాణికుల ప్రాణాలను నిర్లక్ష్యం చేసిన ఇద్దరు పైలెట్ల లైసెన్స్ లను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం ఈ నిర్ణయం వెలువడింది. నూతన సంవత్సరం రోజున లండన్- ముంబయి జెట్ ఎయిర్ వేస్ విమానం ప్రయాణిస్తుండగా.. ఏమైందో తెలియదు కానీ ఇద్దరు పైలెట్లు తమ బాధ్యతలను గాలికొదిలి కాక్‌పిట్‌లో గొడవకు దిగారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన డీజీసీఏ ఇద్దరు పైలెట్లను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించడంతో పాటు వారి లైసెన్స్ ను ఐదేళ్లపాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 14 మంది సిబ్బంది సహా 324 మందితో బయలుదేరిన 9డబ్ల్యూ 119 జెట్ ఎయిర్ వేస్ విమానంలో కో పైలెట్, మహిళా కమాండర్ పై చేయి చేసుకున్నాడు. ఆపై మహిళా ఉద్యోగిని ఏడుస్తూ క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కో పైలెట్ సైతం విధులు నిర్వహించకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశాడు. కాక్‌పిట్‌లో జరిగిన గొడవను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment