విమానం హఠాత్తుగా నిలిపివేయడంతో వెంటనే మమ్మల్ని బయటికి పంపాలంటూ సిబ్బందిపై ప్రయాణికులు దౌర్జన్యం చేసిన వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఢిల్లీ నుంచి ముంబయికి గురువారం సాయంత్రం ప్రయాణికులతో బయలుదేరింది. కానీ కొద్ది సేపటికే ఇంజిన్‌లో సాంకేతికత లోపించడంతో విమానంలోని పైలట్ తిరిగి రన్‌వే మీదకు తీసుకువచ్చాడు. ఈ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు అసలేం జరిగిందో తెలుసుకోకుండా క్యాబిన్ క్రూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఊరుకోకుండా కాక్‌పిట్ డోర్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించారు.
'ఒక ప్రయాణికుడు మేము ఎంత చెప్పినా వినకుండా ఇప్పుడు పైలట్ బయటికి రాకుంటే కాక్‌పిట్ డోరును బద్దలు కొడాతానంటూ నానా రభస చేశాడు. మరో మహిళ ఏకంగా మా సిబ్బందిలో ఒకరి చేయి పట్టుకొని వెంటనే మెయిన్ ఎగ్జిట్ గేట్‌ను తొందరగా ఓపెన్ చేయాలంటూ దురుసుగా ప్రవర్తించారు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా ప్రయాణికులు ఇలా దౌర్జన్యం చేయడం మాకు చాలా బాధగా అనిపించిందంటూ' సిబ్బంది వాపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎయిర్‌లైన్స్ అధికారులు ప్రయాణికుల దురుసు ప్రవర్తనపై ఒక రిపోర్టును అందజేయాలంటూ విమాన సిబ్బందిని కోరింది.(వైరల్: అమ్మాయిల వేషధారణలో అబ్బాయిలు)
'ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని నిలిపివేశాడు. అంతమాత్రానికే ప్రయాణికులు ఇలా దౌర్జన్యం చేయడం ఏం బాలేదు. దీనిపై సిబ్బంది రిపోర్టు అందజేయగానే విచారణ నిర్వహిస్తాము.దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికులపై చర్యలు తీసుకుంటామని' అధికారి పేర్కొన్నారు. అయితే ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. విమానం నిలిపివేయడానికి కారణం ఏంటో తెలుసుకోకుండా ప్రయాణికులు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment