వెబ్‌డెస్క్: జపాన్‌లో బుల్లెట్ రైలు నడిపే ఓ డ్రైవర్ నిర్లక్ష్యం అందరినీ కాసేపు టెన్షన్ పెట్టింది. ప్రకృతి పిలుపుతో డ్రైవర్ బాత్రూంకి వెళ్లగా, డ్రైవర్ లేకుండానే బులెట్ రైలు కొన్ని నిమిషాలు పరుగులు పెట్టింది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ కావడంతో డ్రైవర్, కండక్టర్‌లపై చర్యలకు సిద్ధమయ్యారు.
అసలేం జరిగిందంటే..
హికరీ 633 సూపర్ ఫాస్ట్ బుల్లెట్ రైలు శుక్రవారం ఉదయం టొకైడో-షిన్‌కన్‌సేన్ రైల్వే లైన్ల మధ్య నడుస్తోంది. ఆ టైంలో హఠాత్తుగా కడుపు నొప్పి రావడంతో డ్రైవర్ బాత్రూమ్‌కి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ టైంలో కండక్టర్‌ని తన సీట్‌లో ఉంచి వెళ్లాలి. కానీ, ఆ కండక్టర్‌కి లైసెన్స్ లేదు. దీంతో కాక్‌పిట్‌ను ఖాళీగానే వదిలి బాత్‌రూంకి వెళ్లాడు. కనీసం రైలు వేగాన్ని తగ్గించే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడు ట్రైన్ గంటకు150 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. రైళ్లో 160 మంది ప్యాసింజర్లు ఉన్నారు. బుల్లెట్ ట్రైన్ మానిటరింగ్ చేస్తున్న అధికారులు.. డ్రైవర్ ఇంజిన్ కాక్‌పిట్‌లో లేకపోవడంతో కంగారుపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ప్రమాదేమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
చర్యలు తప్పవు
సెంట్రల జపాన్ రైల్వే జపాన్ రూల్స్ ప్రకారం.. బుల్లెట్ ట్రైన్ నడిపే డ్రైవర్‌తో పాటు కండక్టర్‌కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఒకవేళ డ్రైవర్ ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు, అత్యవసర సమయాల్లోనూ ఆ కండక్టర్ ట్రైన్‌ను నడపొచ్చు. అలాకాని పక్షంలో డ్రైవర్ ఎంత ఎమర్జెన్సీ అయిన కాక్‌పిట్‌ను వదిలేసి వెళ్లకూడదు.
Comments
Please login to add a commentAdd a comment