
న్యూఢిల్లీ: మన అనేవాళ్లు ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు కాదనకుండా చేయడానికే ప్రయత్నం చేస్తాం. అదే స్వయంగా మన తల్లి దండ్రులే కోరి మరీ అడిగితే అసలు కాదనలేం కదా. పైగా ఏం చేసి అయినా వాళ్లు కోరింది ఇవ్వడానికీ తపిస్తాం కదా. అచ్చం అలానే చేశాడు ఎర్ల్‌గేజ్ అనే వ్యక్తి. తన తల్లి మాజీ పైలట్ అయిన మైర్తాగేజ్(84) పార్కన్సన్స్ అనే కదలికకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంది. పైగా తన రోజు వారి పనులు చేసుకోవడానికీ కూడా చాలా కష్టపడుతోంది.
(చదవండి: ప్రపంచంలోనే తొలి చైల్డ్ ఆర్టిస్ట్
అయితే తాను చివరిసారిగా విమానం నడపాలని ఉందిరా అంటూ తన కొడుకుని అడిగింది. దీంతో ఆమె కొడుకు తన తల్లి కోరిక ఏవిధంగానైనా నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు విమానాశ్రయ అధికారి కూడా అభ్యర్థించాడు.అయితే సదరు విమానాధికారి ఆమె వయసు రీత్యా మొదట అంగీకరించలేదు. కానీ తర్వాత తన సాటీ మాజీ పైలెట్‌కి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు.
దీంతో ఎర్ల్‌గేజ్ తన తల్లి కోరికను నెరవేర్చడమే కాదు తన తల్లి కాక్‌పీట్‌లో కూర్చోని విమానం నడుపుతుంటే తాను వెనుక నుంచి ఆమెను ఉత్సాహపరుస్తూ ఒక వీడియోనూ కూడా చిత్రికరీంచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భావోద్వేగాలకు సంబంధించిన ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు.
(చదవండి: వీయోడి క్యాసెట్ల స్టోర్)
Comments
Please login to add a commentAdd a comment