కాక్ పిట్ నే టాయ్ లెట్ అనుకుని.....
కాక్ పిట్ నే టాయ్ లెట్ అనుకుని.....
Published Sat, Apr 26 2014 2:13 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
పెళ్లాం వదిలేసింది.... ఆమె అజా అయిపూ లేదు....దాంతో ఏదో మందు వేసుకున్నాడు. ... డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు..... కుడి ఎడమ తెలియలేదు. విమానం కాక్ పిట్ ను చూశాడు. మంచి టాయ్ లెట్ అనుకున్నాడు... అంతే బలవంతంగా కాక్ పిట్ తలుపు తెరిచి 'ఆ పని' చేసేద్దామనుకున్నాడు. అదీ శుక్రవారం నాడు ఆస్ట్రేలియన్ విమానం హైజాక్ డ్రామా అసలు కథ!
శుక్రవారం ఆస్ట్రేలియాకి చెందిన ఒక విమానం హైజాక్ అనుమానాలతో అత్యవసరంగా ఇండోనీషియాలోని బాలి ద్వీపంలోని డెన్ పసార్ ఎయిర్ పోర్టులో దిగడంతో హడావిడి మొదలైంది. మొదట్లో బ్రిస్బేన్ నుంచి బాలి వెళ్లాల్సిన ఈ విమానాన్ని హైజాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
అయితే అదంతా డిప్రెషన్ లో ఉన్న ఓ వ్యక్తి సృష్టించిన హై డ్రామా అని తేలిపోయింది. మత్తులో ఉన్న మాట్ క్రిస్టఫర్ లాక్లీ అనే ప్రయాణికుడు విమానం కాక్ పిట్ లోకి బలవంతంగా చొరబడేందుకు యత్నించాడు. దీనితో సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. డెన్ పసార్ విమానాశ్రయంలో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
విచారణలో తేలిందేమిటంటే ఇండోనీసియాకి చెందిన అతని భార్య అతడిని వదిలేసింది. ఆమెను వెతుక్కుంటూ ఇండోనీషియాకి బయలుదేరాడు. త్రీఫోర్త్ నిక్కరు, టీ షర్టు వేసుకుని విమానం ఎక్కేశాడు. ఏవో పెయిన్ కిల్లర్లు వేసుకున్నాడు. ఓ రెండు కోక్ లు పట్టించాడు. అవన్నీ యాక్షన్, రియాక్షన్ మొదలుపెట్టాయి. దాంతో 'పని' కావించేందుకు టాయ్ లెట్ వెళ్లాలనుకున్నాడు. కాక్ పిట్ నే టాయిలెట్ అనుకుని తలుపులు తీయబోయాడు. తలుపులు తెరుచుకోలేదు. దాంతో దబదబా బాదేశాడు. ఆదీ సంగతి.
Advertisement
Advertisement