విమానాన్ని ఆపిన ఎలుక! | Mouse hunt delays New York bound flight by 5 hours | Sakshi
Sakshi News home page

విమానాన్ని ఆపిన ఎలుక!

Published Sun, Nov 2 2014 3:45 PM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

విమానాన్ని ఆపిన ఎలుక! - Sakshi

విమానాన్ని ఆపిన ఎలుక!

లండన్: బుల్లి మూషికం భారీ విమానాన్ని నిలిపివేసింది. కాక్ పిట్ లో ఎలుక దూరడంతో నార్వే ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఐదు గంటల పాటు నిలిచిపోయింది. న్యూయార్క్ వెళ్లాల్సిన విమానంలో ఎలుక హల్ చల్ చేయడంతో విమానం ఆగిపోయింది. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక పత్రిక తెలిపింది.

విమానం పైకి ఎగరడానికి సిద్దంగా ఉన్న సమయంలో కాక్ పిట్ లోకి ఎలుక దూరినట్టు గమనించిన సిబ్బంది దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. చివరకు ఎలాగోలా ఎలుకను పట్టుకున్నారు. ఇంకా ఏమైనా ఎలుకలు ఉన్నాయోమోనని విమానం మొత్తం సోదించారు. ఈ నేపథ్యంలో ఐదు గంటల పాటు విమానం ఆగిపోయింది. ఎలుకలు విమానం లోపలి వైర్లను కొరికెస్తాయనే భయంతోనే వాటిని పట్టుకున్నామని సిబ్బంది వెల్లడించారు. అయితే ఆలస్యంపై ప్రయాణికులు ఎలా స్పందించారనేది తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement