Mouse
-
రోబో ఎలుక
ఇటీవలి సంవత్సరాల్లో శాస్త్రవేత్తలు రోబోటిక్ చేపల నుంచి రోబోటిక్ శునకాల దాకా అనేక జంతువులను అభివృద్ధి చేశారు. అయితే ఇటీవల శాస్తవేత్తలు రోబోటిక్ ఎలుకను రూపొందించారు. దాన్ని ఎక్కడ, ఎవరు తయారుచేశారు? అదేం పనులు చేస్తుందనే విశేషాలేంటో చూద్దాం. –సాక్షి, సెంట్రల్ డెస్క్ చైనాలోని బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ‘రోబో ర్యాట్’ను ఆవిష్కరించారు. ‘స్కురో (స్మాల్సైజ్ క్వాడ్రుపెడ్ రోబొటిక్ ర్యాట్)’అని పిలిచే ఈ నాలుగు కాళ్ల రోబో ఎలుక.. నిజమైన ఎలుక మాదిరే నడవగలదు, మోకాళ్లు వంచి వెళ్లగలదు, నెమ్మదిగా పాకుతున్నట్లు కూడా పోగలదు. దాని శరీర బరువులో 91 శాతం బరువును మోసుకెళ్లగలదు. ఇది తన శరీరాన్ని ముడుచుకుని చాలాచిన్నపాటి గ్యాప్‌లలో కూడా వేగంగా పరిగెత్తే సామర్థ్యం కలిగిఉంటుంది. కిందపడినా కూడా మళ్లీ నిలబడగలదు కూడా. విజయవంతంగా పరీక్షలు పరిశోధకులు ఈ రోబో ఎలుకను ఇటీవల క్షేత్రస్థాయిలో పలు రకాలుగా పరీక్షించారు. ‘చక్కగా లేకుండా ఎగుడుదిగుడుగా వంపులతో ఉన్న 3.5 అంగుళాల వెడల్పున్న చిన్న మార్గంలో ఇది విజయవంతంగా తన పనిని నిర్వర్తించింది. 1.1 అంగుళాల ఎత్తున్న అడ్డంకులను సులువుగా అధిగమించడంతోపాటు 15 డిగ్రీలు వాలుగా ఉన్న చోట కూడా ఇబ్బంది పడకుండా ముందుకువెళ్లింది. దాని శరీర బరువులో 91 శాతం బరువున్న పేలోడ్‌ను కూడా మోసుకుంటూ వెళ్లింది’అని దాని రూపకర్తలు చెప్పారు. ఈ రోబో ఎలుక దానికి అప్పగించిన అన్ని పనులను చురుగ్గా చేసిందంటూ వారు హర్షం వ్యక్తంచేశారు. 220 గ్రాముల బరువున్న ఈ ఎలుక దాదాపు 200 గ్రాముల బరువును మోసుకెళ్లిందన్నారు. మనుషులు వెళ్లలేని చోటికి... దీని సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి విపత్తులు సంభవించిన చోట శిథిలాల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు, మనుషులు వెళ్లేందుకు క్లిష్టంగా ఉన్న ప్రాంతాల్లో గాలింపుచర్యలు చేపట్టడానికి దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే పరిశోధనల కోసం కూ డా దీన్ని వాడొచ్చని అంటున్నారు. తొలుత చ క్రాలతో దీన్ని రూపొందించగా, తర్వాత మరిం త చురుగ్గా కదిలేందుకు కాళ్లు అమర్చారు. -
కరోనా సోకిన ఎలుక కరవడంతో సైంటిస్టుకు పాజిటివ్
దాదాపు రెండేళ్ల నుంచి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టిపీడిస్తోంది. కోట్లాది మంది కోవిడ్ భారిన పడగా.. లక్షలాది మంది ఈ మహమ్మారి బలితీసుకుంది. కరోనా తగ్గుముఖం పడతుందనుకున్న ప్రతీసారి మరో కొత్త రూపం దాల్చి మళ్లీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వేరియంట్లలో ఆల్ఫా, బీటాలు పెద్దగా ప్రభావం చూపకపోయినా ఆ తరువాత వచ్చిన డెల్లా వేరియంట్ మాత్రం ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 57 దేశాలకు పాకింది. కరోనా మహమ్మారి ఇప్పటి వరకూ ఒక మనిషి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలుసు. అలాగే కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, అతని వాడిన వస్తువులు వేరే వారు తాకిన కోవిడ్ వ్యాపిస్తుందని తెలుసు. అయితే తాజాగా ఎలుక కరిచినా కరోనా సోకుతున్నట్లు తేలింది. తైవాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన బయో-సేఫ్టీ ల్యాబరేటరీలోని ఓ సైంటిస్ట్‌కు ఎలుక కరవడంతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తైవాన్‌లోని టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అకాడెమియా సినికా అనే జన్యుక్రమ విశ్లేషణ సంస్థలో పనిచేస్తున్న 20 ఏళ్ల మహిళకు వైరస్ సోకినట్లు తేలిందని అక్కడి ఆరోగ్య మంత్రి చెన్ షిహ్-చుంగ్ బ్రీఫింగ్ తెలిపారు. చదవండి:: కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం..బాతులు, కోళ్లను చంపేయండి! కాగా ఆమె ఈ మధ్యకాలంలో ఎక్కడికీ ప్రయాణం చేయలేదని, మోడర్నా ఎంఆర్ఎన్ఏ రెండు డోసుల వ్యాక్సిన్ ను కూడా సైంటిస్ట్ తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక గత నెల రోజులుగా ద్వీప దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. చివరి సారిగా నవంబర్ 5న పాజిటివ్ నమోదైంది. తాజాగా ఎలుక కరవడంతో తొలి కేసు నమోదైంది. సైంటిస్ట్‌కు పాటివ్‌గా తేలడంతో ఆమెతో సన్నిహితంగా మెలిగిన 100 మందిని క్వారంటైన్లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఎలుక కరవడం వల్లే కరోనా సోకింది అనేది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఎలుక కారణంగానే వైరస్ వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి మరింత పరిశోధన జరుగుతంద ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మహిళకు డెల్టా వేరియంట్ సోకిందని అధికారులు భావిస్తున్నారు. కాగా, అకాడమికా సినికాలో జంతువుల్లోని వివిధ వ్యాధి కారక క్రిములను బయటకు తీసి పరిశోధనలను చేస్తుంటారు. టీకా పనితీరు, వాటి ప్రభావం వంటి వాటిని తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సైంటిస్ట్‌కు ఎలుక కరిచిందని అధికారులు చెబుతున్నారు. చదవండి: ఒమిక్రాన్ అలజడి: భారత్‌లో మరో మూడు కేసులు.. -
ప్రాణం కోసం విలవిల.. గట్టిగా చుట్టి మింగేసింది
జకార్తా : ఎముకలను పిండి చేస్తున్న ఒత్తిడి. ఊపిరి ఆడని పరిస్థితి. కళ్లు మామూలుకంటే పెద్దవయ్యాయి. కొద్దిగా బయటకు పొడుచుకొచ్చాయి. నోరు తెరిచింది.. కీస్.. కీస్ అని అరిచింది. సహాయం కోసం అన్నట్లు చేతులు బార్లా చాచింది... ఓ కొండ చిలువ చుట్టలో నలిగి ప్రాణాల కోసం గిలగిల్లాడిన ఓ ఎలుక పరిస్థితి ఇది. కొద్దిరోజుల క్రితం ఇండోనేషియాకు చెందిన జుల్ జుల్ఫిక్రి తన పెంపుడు కొండచిలువకు బతికున్న ఎలుకను ఆహారంగా వేశాడు. ఫొటో క్రెడిట్ (mediadrum world.com/@dzulfikri72) వెంటనే కెమెరా తీసుకుని ఫొటోలు తీయటం మొదలుపెట్టాడు. కొండచిలువ.. ఎలుకను చుట్టి, మింగేస్తున్న దృశ్యాలను ఫొటోలు తీశాడు. దాదాపు 5 నిమిషాల ఈ బతుకుపోరాటాన్ని కెమెరాలో బంధించాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ ఫొటోలు తీసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నా.. ఆఖరి క్షణాల్లో ఎలుక ప్రాణాలకోసం విలవిల్లాడటం చూస్తూ బాధేసింది’’ అని పేర్కొన్నాడు. ఫొటో క్రెడిట్ (mediadrum world.com/@dzulfikri72) -
బడ్జెట్ సమావేశాలు : ఎలుకతో అసెంబ్లీకి
పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్ష ఆర్జేడీ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో.. శుక్రవారం విపక్ష శాసనసభ్యులు ఎలుకను వెంటపెట్టుకుని సభకు వచ్చారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వం కీలక పత్రాలను మాయం చేస్తోందని, వాటిపై ప్రశ్నిస్తే ఎలుకలను సాకుగా చూపుతున్నారని అన్నారు. అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడిసిన్, లిక్కర్ మాఫియా జరుగుతోందని వాటికి కూడా ఎలుకలనే సాకుగా చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎలుకలను పట్టుకుని వచ్చి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామని వివరించారు. -
బతికున్న ఎలుకల్ని కరకరా నమిలేశాడు..!
-
గుచ్చి గుచ్చి చంపాడు.. కరకరా నమిలేశాడు..!
బీజింగ్ : చైనాలో పాముల వేపుడు, కప్పల పులుసు తినడం చూసే ఉంటాం. కానీ, ఓ వ్యక్తి మాత్రం మరో అడుగు ముందుకేసి ఏకంగా బతికున్న ఎలుకల్నే ఫలహారంగా నమిలి మింగేశాడు. చిన్న చిన్న ఎలుకల్ని ఓ చైనీయుడు చోప్స్టిక్లతో పొడుచుకుని.. సాస్‌లో ముంచుకుని తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ జుగుప్సాకర సన్నివేశం దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో వెలుగుచూసింది. బుల్లి ఎలుకలు ప్లేట్లో నుంచి పారిపోతుండగా.. ఈ కర్కోటకుడు ఎలా తింటున్నాడో చూడండి అంటూ.. సదరు వీడియోని @sauwingso యూజర్ ట్విటర్లో పోస్టు చేశారు. ఇక ఈ పచ్చి మాంస భక్షకుడిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నాగారిక సమాజంలో ఇంతటి అనాగరిక చర్యలకు పాల్పడతారా..! అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నచ్చిన ఆహారం తినడంలో తప్పులేదు. కానీ, ఆ మూగ ప్రాణుల్ని హింసించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ‘ఓ మై గాడ్..! అప్పుడే పుట్టిన చిన్న చిన్న ఎలుకల్ని తింటున్నాడా..! వాంతులు వస్తున్నాయి’ అని ఓ యూజర్ వికారం వ్యక్తం చేశాడు. గబ్బిలాలు, ఎలుకలు, పునుగు పిల్లులను తినడం వల్లే ప్రాణాంతక వైరస్లు మానవాళిని కబలిస్తున్నాయని మరొక యూజర్ పేర్కొనగా.. నా కర్మ కొద్దీ ఈ వీడియో చూశానని ఇంకొకరు విచారం వ్యక్తం చేశారు. 30 సెకన్ల నివిడి ఉన్న ఈ వీడియో 1.4 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. -
కోకాకోలా బాటిల్లో చచ్చిన ఎలుక
-
కూల్ డ్రింక్ బాటిల్లో చచ్చిన ఎలుక
అసలే ఎండలు మండిపోతున్నాయి...చల్లగా ఓ కూల్ డ్రింక్ తాగుదమనుకునే వారు మనలో కోకొల్లలు. వేసవి అనే కాదు ఏ కాలంలో అయిన కూల్ డ్రింక్‌ల వినియోగం ఎక్కువే. వీటి ప్యాకింగ్ సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది కాస్తా వినియోగదారుల ప్రాణాల మీదకు తెస్తుంది. ఇందుకు సంబంధించిన వార్తలను కూడా తరచుగా చూస్తునే ఉంటాము. ఈ మధ్యే కాఫీలో బొద్దింక వచ్చిందనే వార్త చూశాము. ప్రస్తుతం ఈ కోవకు సంబంధించిన ఓ వార్త ఒకటి వైరల్ అయ్యింది. కోక్ బాటిల్ కొన్న వ్యక్తికి దానిలో చచ్చిన ఎలుక వచ్చింది. అర్జెంటీనాకు చెందిన డియాగో పెరియా అనే వ్యక్తి తాను కొన్న కోక్ బాటిల్లో ఏదో ఉన్నట్లు అనిపించింది. అదేంటో తెలుసుకోవడం కోసం బాటిల్లో ఉన్న కోక్‌ను ఒక గ్లాసులోకి పోశాడు. అప్పుడు బాటిల్లో అతడికి చచ్చిన ఎలుక కనిపించింది. ఈ మొత్తం విషయాన్ని అతడు వీడియో తీశాడు. తాను కోక్ బాటిల్లో ఎలుకను చూడటం ఇది రెండోసారి అంటూ సోషలో మీడియాలో పోస్టు చేశాడు. కానీ కంపెనీ మాత్రం ఈ విషయం గురించి ఏమి మాట్లడలేదు. -
ధన మూషిక
ఈ లోకంలో పనికిరానిదంటూ ఏదీ లేదని పెద్దలు చెబుతుంటారు. సాధారణంగా ఎలుకలంటే మనకు మహా చిరాకు. ఎందుకంటే వాటివల్ల అన్నీ నష్టాలే. అందుకే ఎలుకలను బోను పెట్టో, మందు పెట్టో వాటిని మట్టుబెడుతుంటాం. అయితే ఎలుకలతో లక్షల్లో ఆదాయం గడించవచ్చనే సంగతి తెలుసా? రామనగర (దొడ్డబళ్లాపురం): ఎలుకలతో ఆదాయమా, ఔనా? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. బెంగళూరు సమీపంలో రామనగర తాలూకా అక్కూరు గ్రామం రైతులు కొందరు ఇప్పుడు తెల్ల ఎలుకలను పెంచుతూ ధనలక్ష్మి దయను పొందుతున్నారు. అక్కూరు గ్రామంలో ప్రస్తుతం 6 మంది రైతులు తెల్ల మూషికాల పెంపకం సాగిస్తున్నారు. వీరిని చూసి మరికొందరు ముందుకు వస్తున్నారు.ఒక్కో రైతు సుమారు 100 తెల్ల ఎలుకలను పెంచుతున్నారు. ఇవి పెట్టే పిల్లలను విక్రయించడం ద్వారా వీరు ఏడాదికి కనీసం 3 నుండి 4 లక్షలు ఆదాయం పొందుతున్నారు. ఈ సరికొత్త ఉపాధి ఇప్పుడు గ్రామాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. పెంపకం చాలా ఈజీ లక్కూరు గ్రామంలో ఆదర్శ రైతు జయకుమార్ ఏడాదిన్నర క్రితం మొదట తెల్ల ఎలుకల పెంపకం ప్రారంభించగా ఇప్పుడు మరి కొంతమంది రైతులు ఇదే బాట పట్టారు. కుందేళ్లను పెం చడానికి మాదిరిగానే వీటి కోసం కూడా పెట్టెలను ఏర్పాటు చేశాడు. ఈయన వద్ద ఉన్న 70 ఎలుకలలో 50 ఆడ ఎలుకలయితే 20 మగ ఎలుకలున్నా యి. ఏడాదిన్నరలో ఆరుసార్లు ఎలుక పిల్లలను విక్రయించాడు. ఆడ ఎలుక రెండు నెలలకోసారి పిల్లలు పెడుతుంది. ప్రతి ఏడాదికీ సరాసరి ఒక ఎలుక 20 వరకూ పిల్లలు పెడుతుంది.అరె తిమ్మయ్య అనే రైతు తన తోటలో రూ.3 లక్షలు ఖర్చు చేసి ఎలుకల పెంపకం కోసం షెడ్డు నిర్మించాడు. ఒక ఎలుకకు రూ.800 చొప్పున చెల్లించి 80 ఎలుకలను తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అవి పెద్దసంఖ్యలో పిల్లలను ఉత్పత్తి చేశాయి. వీటి ఆహారం కోసం వేలల్లో ఖర్చు ఏమీ కాదు. శెనగపొట్టు, పశువులకు కలిపే పిండి వేసినా వద్దనకుండా తినేస్తాయి. వీటిని చూసుకోవడానికి పెద్దగా పనివాళ్ల అవసరం కూడా ఉండదు. ఆహారం ఇవ్వడానికి, ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి ఇద్దరుంటే చాలు. తెల్ల ఎలుకలు ఆహారంలోనే నీటిని తీసుకుంటాయి కాబట్టి ప్రత్యేకంగా నీరు పెట్టాల్సిన పనిలేదు. వీటికి రోగాల రొష్టుల బాధ కూడా అస్సలు ఉండదు. ఏమిటీ ఉపయోగం? ఇంతకీ తెల్ల ఎలుకలతో ఏం చేస్తారు? అనే ప్రశ్న వినిపిస్తుంది. ఔషధ సంస్థలకు తెల్ల ఎలుకలు ఎంతో అవసరం. ఆ సంస్థలు కొత్త ఔషధం తయారు చేసేటప్పుడు వాటిని ఎలుకలు, కుందేళ్లు వంటి మూగప్రాణుల మీద ప్రయోగించి ఫలితాలను చూస్తాయి. ఈ ప్రయోగాలకు తెల్ల ఎలుకలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆ ఔషధాలకు మనుషులు ఎలా స్పందిస్తారో ఇవి కూడా అలాగే స్పందించడం వల్ల ఫలితాలు కచ్చితంగా ఉంటాయని ఔషధ నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి ప్రయోగాలకు వేల సంఖ్యలో ఎలుకలు అవసరం ఉంటుంది. ఇలాంటి ప్రయోగశాలలకు తెల్ల ఎలుకలు సరఫరా చేయడానికి వీటి పెంపకం జరుగుతోంది. ఒక్కో ఎలుక రేటు రూ.400 ప్రస్తుతం ఈ రైతులు తమిళనాడుకు చెం దిన ఒక కంపెనీతో 5 సంవత్సరాలకు ఒప్పం దం చేసుకున్నారు. ఆ కంపెనీవారే నేరుగా వీ రి వద్ద ఎలుకలు ఖరీదు చేస్తారు. సుమారు 25 రోజుల వయసు ఉండి 150 నుండి 400 గ్రా ముల బరువు ఉండే ఎలుకలను తలా రూ. 400 నుండి 500 వరకూ ధర చెల్లించి కొంటా రు. ప్రస్తుతం రైతులు మధ్యవర్తి ద్వారా ఎలుక పిల్లలను విక్రయిస్తున్నారు. అదే ప్రయోగశాలలతో నేరుగా ఒప్పందం చేసుకుంటే ఇంతకు రెండు రెట్లు ఆదాయం పొందవచ్చు. తెల్ల ఎ లుకలపై మరిన్ని వివరాలకు రైతు విజయ్‌కుమార్–97416 31862లో సంప్రదించవచ్చు. -
డ్రగ్స్‌తో పట్టుబడ్డ ఎలుక
బ్రెజిల్ : ఇప్పటివరకు డ్రగ్స్‌ను మనుషులు తరలించడం గురించి విన్నాం. కానీ ఇక్కడ ఓ చిట్టెలుక ఆ బాధ్యతను తలకెత్తుకుంది. కొకైన్, గంజాయి వంటి డ్రగ్స్‌ను తరలిస్తూ సీసీ టీవీలో పోలీసు అధికారుల కంట పడింది. దాంతో పోలీసులు 'ఔరా మూషికా..!' అంటూ నోరెళ్లబెట్టారు. ఈ సంఘటన బ్రెజిల్‌లోని అరజ్వైనా పట్టణంలోని బర్రా డా గ్రోటా జైలులో చోటుచేసుకుంది. ఖైదీలు ఒక వింగ్ నుంచి మరో వింగ్‌కు ఈ ఎలుక సాయంతో డ్రగ్స్‌ను కొరియర్ చేస్తున్నారు. ఎలుక తోకకు ఓ తాడును కట్టి .. ఆ తాడుకి డ్రగ్స్ ప్యాకెట్‌ను కడుతున్నారు. ఆ ఎలుక దాన్ని చేర్చాల్సిన చోటుకి చేర్చుతుంది. ఇదంతా గత శుక్రవారం సీసీ టీవీలో గమనించిన జైలు అధికారులు విస్తుపోయారు. వెంటనే వారు ఖైదీల వద్ద తనిఖీలు జరిపి 30 ప్యాకెట్ల గంజాయి, 20 ప్యాకెట్ల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
సెన్సర్ కీబోర్డు
గాడ్జెట్ ఏదైనా మెయిల్ టైప్ చేయాలంటే కీబోర్డు తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే మౌస్ ఉండక తప్పదు. ఊహూ.. అక్కరలేదంటోంది జెస్ట్. కీబోర్డు ఉందనుకుని గాల్లో టైప్ చేసినా వాటిని కంప్యూటర్ తెరపై అక్షరాలుగా మార్చేస్తుందీ హైటెక్ గాడ్జెట్. ఫొటోలో చూపినట్లు నాలుగు వేళ్లకు తగిలించుకునే రింగ్‌లు, అరచేతిపై అమర్చుకునే పట్టీలతో కూడిన జెస్ట్‌లో యాక్సెలరోమీటర్లు, గైరోస్కోపులు, మాగ్నెటోమీటర్లు బోలెడు ఉంటాయి. ఇవన్నీ మన వేలి కదలికలను బట్టి అక్షరాలను అంచనావేసి స్క్రీన్‌పై చూపుతాయి. స్మార్ట్ఫోన్లలో మాదిరిగా ప్రిడిక్టివ్ టెక్ట్స్టెక్నాలజీని ఉపయోగించుకుంటాయి. తదనుగుణంగా మనం టైప్ చేసుకుంటూ కావాల్సిన పదాలను సెలెక్ట్ చేసుకుంటే సరి. రెండేళ్ల క్రితం జరిగిన ఓ హ్యాకథాన్‌లో రాత్రికిరాత్రి ఈ గాడ్జెట్ ప్రొటోటైప్‌ను తయారు చేసిన మైక్ ఫ్రిస్టర్ బృందం ఆ తరువాత అపోటాక్ట్ ల్యాబ్ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేసి జెస్ట్‌ను మరింత అభివృద్ధి చేసింది. వాణిజ్యస్థాయి తయారీకి నిధులు కావాలంటూ కిక్‌స్టార్టర్‌లో ప్రచారం చేపట్టడంతో దీని గురించి ప్రపంచానికి తెలిసింది. జెస్ట్ ఎక్స్‌బాక్స్ కైనిక్ట్ లేదా లీప్ మోషన్ మాదిరిగా పూర్తిగా వేలి కదలికలపై మాత్రమే ఆధారపడదని, మౌస్ బటన్‌ను డబుల్ క్లిక్ చేసినట్లు... లేదా కీబోర్డ్ షార్ట్కట్ల తీరులో ఒక బటన్ ప్రెస్ చేసినప్పుడు నిర్దిష్టమైన పని జరిగేట్టు కూడా పనిచేస్తుందని ఫ్రిస్టర్ అంటున్నారు. బ్లూటూత్ ఉన్న ఏ పరికరంతోనైనా జెస్ట్ పనిచేస్తుందని చెప్పారు. కిక్‌స్టార్టర్ ద్వారా అనుకున్నన్ని నిధులు సమకూరితే వచ్చే ఏడాదికల్లా జెస్ట్ మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. -
ఎలుకజాతి ఏనుగు!
ప్లే టైమ్: క్యాపిబరా... ప్రస్తుతం సృష్టిలో ఉన్న మూషిక జాతుల్లోకెల్లా పెద్దది. చూడటానికి ఏదో జంతువులా ఉన్నా ఎలుక పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. కనీసం 40 కేజీల బరువు, ఒకటిన్నర అడుగు, ఎత్తు, బారుగా నాలుగడుగుల పొడవు ఉండే ఇది పందికొక్కు అనే మాటకు సిసలైన నిదర్శనంలా ఉంటుంది. క్యాపిబరాలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల్లో కనిపిస్తాయి. సవన్నా గడ్డిభూములు వీటికి ఆవాసాలు. చెరువులు, నదులు, సరస్సుల ప్రాంతంలో జీవిస్తాయి. నీటిలో ఈదగల, భూమిమీద బతికే సామర్థ్యం వీటిది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఏదైనా పెద్ద జంతువు నుంచి తమకు ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు నీళ్లలోకి వెళ్లి దాక్కోవడం వీటి ప్రత్యేకత. అలా కొన్ని నిమిషాల పాటు నీళ్లలో దాక్కొని లోలోపలే ఈదుకొంటూ వెళ్లి ఇవి క్రూరజంతువుల బారి నుంచి బయటపడుతూ ఉంటాయి. సంఘటితంగా ఉండటం వీటి జీవనశైలి. ఒక్కో సమూహంలో వంద వరకూ ఉంటాయి. వాటిలో అవి జతకడుతూ సంతానోత్పత్తి చేసుకొంటాయి. ఇవి ఎనిమిది నుంచి పది సంవత్సరాల పాటు బతకగలవు. గడ్డిభూముల్లో పెరిగే దుంపలు, గడ్డి, ఆకులే వీటి ఆహారం. ఒక్కో క్యాపిబరా రోజుకు కనీసం మూడున్నర కేజీల ఆహారాన్ని తీసుకొంటుంది. -
మౌస్‌లో పీసీ...
మౌస్‌లో యూఎస్బీ పోర్టులు ఉన్నాయేమిటా? అనేనా మీ సందేహం. అవి మాత్రమే కాదు... ఓ ప్రాసెసర్, మదర్బోర్డ్, ర్యామ్, మెమరీ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంకోలా చెప్పాలంటే ఇది కేవలం మౌస్ మాత్రమే కాదు. పూర్తిస్థాయి పర్సనల్ కంప్యూటర్. మానిటర్, కీబోర్డులను చేర్చుకుంటే చాలు! మౌస్బాక్స్ అని పిలుస్తున్న ఈ పీసీలో 1.4 గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌తోపాటు 128 జీబీల ఫ్లాష్ మెమరీ, యూఎస్బీ 3.0 పోర్టులు రెండు ఉన్నాయి. పోలండ్ ఇంజినీర్లు కొందరు సిద్ధం చేసిన ఈ నమూనాను వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
విమానాన్ని ఆపిన ఎలుక!
లండన్: బుల్లి మూషికం భారీ విమానాన్ని నిలిపివేసింది. కాక్ పిట్ లో ఎలుక దూరడంతో నార్వే ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం ఐదు గంటల పాటు నిలిచిపోయింది. న్యూయార్క్ వెళ్లాల్సిన విమానంలో ఎలుక హల్ చల్ చేయడంతో విమానం ఆగిపోయింది. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక పత్రిక తెలిపింది. విమానం పైకి ఎగరడానికి సిద్దంగా ఉన్న సమయంలో కాక్ పిట్ లోకి ఎలుక దూరినట్టు గమనించిన సిబ్బంది దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. చివరకు ఎలాగోలా ఎలుకను పట్టుకున్నారు. ఇంకా ఏమైనా ఎలుకలు ఉన్నాయోమోనని విమానం మొత్తం సోదించారు. ఈ నేపథ్యంలో ఐదు గంటల పాటు విమానం ఆగిపోయింది. ఎలుకలు విమానం లోపలి వైర్లను కొరికెస్తాయనే భయంతోనే వాటిని పట్టుకున్నామని సిబ్బంది వెల్లడించారు. అయితే ఆలస్యంపై ప్రయాణికులు ఎలా స్పందించారనేది తెలియరాలేదు. -
మౌస్‌కు మూడినట్టే!
1960ల నుంచీ కంప్యూటర్ కు అట్టిపెట్టుకుని ఇప్పటికీ మన చేతుల్లో ఆడుతూ వస్తున్న మౌస్‌కు ఇక కాలం చెల్లినట్లే. ఎందుకంటే.. చేతివేలికి తొడుగులా కనిపిస్తున్న ఈ పరికరమే ఇకపై మౌస్ చేసే పనులన్నీ చేయనుంది. ఇప్పటిదాకా మనం వాడుతున్న మౌస్ కంప్యూటర్ తెరపై రెండు కోణాల్లో మాత్రమే కర్సర్‌ను కదిలిస్తుంది. అదే ఈ కొత్త పరికరం మూడు కోణాల్లోనూ కర్సర్‌ను కదిలిస్తుందట. అందుకే దీనికి ‘3డీ టచ్’ అని పేరు పెట్టారు. త్రీడీ యాక్సిలెరోమీటర్, త్రీడీ మాగ్నెటోమీటర్, త్రీడీ గైరోస్కోప్, ఆప్టికల్ సెన్సర్లను పొందుపర్చి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వ్యోమింగ్ పరిశోధకులు దీనిని తయారు చేశారు. ప్రస్తుతం తీగలు తగిలించినా.. భవిష్యత్తులో వైర్‌లెస్‌గా పనిచేసేలా మారుస్తారట. దీనిని పెట్టుకుని వేలును కంప్యూటర్ తెరముందు కదిలిస్తే చాలు.. వేలు కదిలినట్టల్లా.. కర్సర్ కదులుతుంది. అలాగే మౌస్ ప్యాడ్‌పై వేలును తట్టి క్లిక్ చేయడంతో పాటు తెరపై వస్తువులను డ్రాగ్ చేయొచ్చు కూడా. -
కంప్యూటర్ మౌస్ కు ఇక కాలం చెల్లినట్లే!
వాషింగ్టన్ : 1960 నుంచీ కంప్యూటర్ కు అట్టిపెట్టుకుని ఇప్పటికీ మన చేతుల్లో ఆడుతూ వస్తున్న మౌస్‌కు ఇక కాలం చెల్లినట్లే. ఎందుకంటే.. చేతివేలికి తొడుగులా ఉండే పరికరం ఇకపై మౌస్ చేసే పనులన్నీ చేయనుంది. ఇప్పటిదాకా మనం వాడుతున్న మౌస్ కంప్యూటర్ తెరపై రెండు కోణాల్లో మాత్రమే కర్సర్‌ను కదిలిస్తుంది. అదే ఈ కొత్త పరికరం మూడు కోణాల్లోనూ కర్సర్‌ను కదిలిస్తుందట. అందుకే దీనికి ‘3డీ టచ్’ అని పేరు పెట్టారు. త్రీడీ యాక్సిలెరోమీటర్, త్రీడీ మాగ్నెటోమీటర్, త్రీడీ గైరోస్కోప్, ఆప్టికల్ సెన్సర్లను పొందుపర్చి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వ్యోమింగ్ పరిశోధకులు దీనిని తయారు చేశారు. దీనిని పెట్టుకుని వేలును కంప్యూటర్ తెరముందు కదిలిస్తే చాలు.. వేలు కదిలినట్టల్లా.. కర్సర్ కదులుతుంది. అలాగే మౌస్ ప్యాడ్‌పై వేలును తట్టి క్లిక్ చేయడంతో పాటు తెరపై వస్తువులను డ్రాగ్ చేయొచ్చు కూడా. ప్రస్తుతం తీగలు తగిలించినా.. భవిష్యత్తులో వైర్‌లెస్‌గా పనిచేసేలా మారుస్తారట. -
స్మార్ట్ఫోనే రిమోట్ కంట్రోల్...
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే దాన్ని మౌస్లా, ట్రాక్పాడ్లా ఉపయోగించుకోవచ్చునని మనకు తెలుసు. కానీ ఇంట్లో ఉన్న అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాల (ఇన్ఫ్రారెడ్ కమాండ్లతో పనిచేసేవి)ను నియంత్రించే రిమోట్‌లా కూడా మార్చుకోవచ్చునని అంటోంది స్మార్ట్ ఐఆర్ రిమోట్ కంపెనీ. ఎనీమోట్ పేరుతో ఈ కంపెనీ విడుదల చేసిన అప్లికేషన్ ద్వారా టీవీ, సెట్‌టాప్ బాక్స్, డీవీడీ, బ్లూరే ప్లేయర్, వీసీఆర్, ఆంప్లిఫైయర్, ఎయిర్ కండీషనర్, ఏవీ రిసీవర్, డీఎస్ఎల్ఆర్ కెమెరాలన్నింటినీ నియంత్రించవచ్చు. ఎల్జీ, సోనీ మినహా మరే ఇతర కంపెనీ పరికరాలతోనైనా ఇది పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. గూగుల్ ప్లేలో అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్ ధర రూ.426 మాత్రమే.