అసలే ఎండలు మండిపోతున్నాయి...చల్లగా ఓ కూల్ డ్రింక్ తాగుదమనుకునే వారు మనలో కోకొల్లలు. వేసవి అనే కాదు ఏ కాలంలో అయిన కూల్ డ్రింక్‌ల వినియోగం ఎక్కువే. వీటి ప్యాకింగ్ సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది కాస్తా వినియోగదారుల ప్రాణాల మీదకు తెస్తుంది. ఇందుకు సంబంధించిన వార్తలను కూడా తరచుగా చూస్తునే ఉంటాము. ఈ మధ్యే కాఫీలో బొద్దింక వచ్చిందనే వార్త చూశాము. ప్రస్తుతం ఈ కోవకు సంబంధించిన ఓ వార్త ఒకటి వైరల్ అయ్యింది. కోక్ బాటిల్ కొన్న వ్యక్తికి దానిలో చచ్చిన ఎలుక వచ్చింది.
అర్జెంటీనాకు చెందిన డియాగో పెరియా అనే వ్యక్తి తాను కొన్న కోక్ బాటిల్‌లో ఏదో ఉన్నట్లు అనిపించింది. అదేంటో తెలుసుకోవడం కోసం బాటిల్‌లో ఉన్న కోక్‌ను ఒక గ్లాసులోకి పోశాడు. అప్పుడు బాటిల్‌లో అతడికి చచ్చిన ఎలుక కనిపించింది. ఈ మొత్తం విషయాన్ని అతడు వీడియో తీశాడు. తాను కోక్ బాటిల్‌లో ఎలుకను చూడటం ఇది రెండోసారి అంటూ సోషలో మీడియాలో పోస్టు చేశాడు. కానీ కంపెనీ మాత్రం ఈ విషయం గురించి ఏమి మాట్లడలేదు.
Comments
Please login to add a commentAdd a comment